జమ్ముకశ్మీర్‌లోని పూంచ్, రాజౌరీ జిల్లాల్లో నియంత్రణ రేఖను సందర్శించారు భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఎల్ఓసీ వద్ద తాజా పరిస్థితి, బలగాల సన్నద్ధతను సమీక్షించారు.
నార్తర్న్ కమాండ్ ఉన్నతాధికారులతో కలిసి నియంత్రణ రేఖ వెంబడి పర్యటించారు రావత్. దక్షిణ పిర్పంజల్లో ఉగ్రవాదంలోకి యువతను చేర్చుకునే ప్రయత్నాలపై చర్చించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాక్‌కు ఎలా ప్రతిఘటిస్తున్నామనే విషయాన్ని పరిశీలించారు.