సైనికాధిపతి నరవాణె రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. లద్దాఖ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై వివరించారు. రెండు రోజులపాటు తూర్పు లద్దాఖ్, వాస్తవాధీన రేఖ సమీపంలోని ప్రాంతాల్లో పర్యటించారు సైనికాధ్యక్షుడు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులు, సైనిక సన్నద్ధత, సరిహద్దు వెంట భారత బలాన్ని పెంచే అంశాలపై రాజ్‌నాథ్‌కు నివేదించినట్లు తెలుస్తోంది.
లేహ్‌లో యుద్ధ విమానాలు..
జూన్ 15,16 తేదిల్లో జరిగిన సరిహద్దు ఘర్షణల అనంతరం వాస్తవాధీన రేఖ వెంట అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది భారత్. క్రమంగా బలగాల సంఖ్యను పెంచుతోంది.
భారత వాయుసేన విమానాలు ఇప్పటికే లేహ్ ప్రాంతానికి చేరాయి. గగనతలంలో చక్కర్లు కొడుతూ గస్తీ నిర్వహిస్తున్నాయి.