తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లద్దాఖ్​లో భారత సైన్యాధిపతి పర్యటన- భద్రతపై సమీక్ష - లద్దాఖ్​లో ఆర్మీచీఫ్​ పర్యటన

భారత సైన్యాధిపతి​ ఎంఎం నరవణే రెండు రోజులు సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా లద్దాఖ్​లో పరిస్థితులను సమీక్షించనున్నారు. పాంగాంగ్​ లోయలో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడిన తరుణంలో.. నరవణే పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

Army Chief arrives in Ladakh to review security situation
లద్దాఖ్​లో ఆర్మీచీఫ్​ పర్యటన- భద్రతపై సమీక్ష

By

Published : Sep 3, 2020, 1:00 PM IST

భారత సైన్యాధిపతి​ ఎంఎం నరవణే తన రెండు రోజుల సరిహద్దు​ పర్యటనలో భాగంగా.. లద్దాఖ్​లో గురవారం సమీక్ష నిర్వహించనున్నారు. పాంగాంగ్​ లోయలో చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు లేహ్​ ప్రాంతానికి చేరుకున్న ఆయన.. మూడు నెలలుగా అక్కడ ఉంటున్న భారత సైన్యంతో తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. సైన్యం సన్నద్ధత, సరిహద్దుల్లో పరిస్థితుల గురించి సీనియర్ ఫీల్డ్​​ కమాండర్లు నరవణేకు వివరించనున్నారు.

ఆగస్టు 29- 30 మధ్య రాత్రి సమయంలో పాంగాంగ్​ లోయ వద్ద గల వాస్తవాధీన రేఖ వెంబడి సైనిక కార్యకలాపాల్ని ప్రారంభించిన చైనా.. సరిహద్దుల్ని ఏకపక్షంగా మార్చేందుకు యత్నించింది. అయితే ఈ కుట్రలను ముందుగానే పసిగట్టిన భారత సైన్యం.. వారి దుశ్చర్యలను దీటుగా తిప్పికొట్టింది. ముందు జాగ్రత్తలో భాగంగా అదనపు భద్రతా బలగాలతో పాటు.. భారీ ఆయుధాలనూ అక్కడికి తరలించింది భారత్​.

ఇదీ చదవండి:పురోగతి లేని భారత్​-చైనా అధికారుల చర్చలు

ABOUT THE AUTHOR

...view details