స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా భారత్-పాక్ నియంత్రణ రేఖ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు అధికారులు. అంతర్జాతీయ సరిహద్దులు, సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచింది బీఎస్ఎఫ్.
కశ్మీర్లో పటిష్ఠ భద్రత
జమ్ము-కశ్మీర్లో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భద్రతను పటిష్ఠం చేశారు. ఈ ప్రాంతంలో అంతర్జాల, టెలీకమ్యూనికేషన్ సేవలను నిలిపివేశారు. రైల్వే స్టేషన్ల వద్ద పహారాను పెంచారు.
"కశ్మీర్ లోయలో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. అయినప్పటికీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొన్ని ఆంక్షలు మాత్రం ఉంటాయి."
-రోహిత్ కాన్సల్, జమ్ము-కశ్మీర్ ప్రధాన కార్యదర్శి
జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక హోదానిచ్చే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత జరుగుతున్న మొదటి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలైనందున పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు.