తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైల్వే బోర్డు తొలి సీఈఓగా​ వీకే యాదవ్​ - railway board chirman

రైల్వే బోర్డు పునర్​వ్యవస్థీకరణలో భాగంగా బోర్డు సీఈఓగా ప్రస్తుత ఛైర్మన్​ వీకే యాదవ్​ నియామకానికి ఆమోద ముద్ర వేసింది కేంద్ర మంత్రివర్గ నియామకాల కమిటీ. రైల్వే చరిత్రలోనే సీఈఓ పదవిని చేపట్టే తొలి వ్యక్తిగా నిలువనున్నారు యాదవ్​.

railway board
రైల్వే బోర్డు తొలి సీఈఓగా​ వీకే యాదవ్​

By

Published : Sep 3, 2020, 5:10 AM IST

Updated : Sep 3, 2020, 6:57 AM IST

రైల్వే బోర్డు ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈఓ)గా ప్రస్తుత ఛైర్మన్​ వినోద్​ కుమార్​ యాదవ్​​ నియమకానికి ఆమోద ముద్ర వేసింది కేంద్ర మంత్రివర్గ నియామకాల కమిటీ. దీంతో రైల్వే చరిత్రలోనే మొట్టమొదటి సీఈఓగా నిలవనున్నారు వీకే యాదవ్.

రైల్వే బోర్డు పునర్​వ్యవస్థీకరణకు బుధవారం ఆమోద ముద్ర వేసింది.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం. బోర్డు సభ్యులను 8 నుంచి ఐదుకు కుదించింది.

ఈ క్రమంలో యాదవ్​​ను బోర్డు సీఈఓగా నియమించింది నియామకాల కమిటీ. బోర్డు సభ్యులుగా.. ప్రదీప్​కుమార్ (మౌలిక సదుపాయాలు), పీసీ శర్మ (ట్రాక్షన్​, రోలింగ్​ స్టాక్​), పీఎస్ మిశ్రా (ఆపరేషన్స్​, వాణిజ్యాభివృద్ధి), మంజూల రంగరాజన్ (ఆర్థికం)లను నియమించింది.

కంట్రోలింగ్​ అధికారిగా..

బోర్డు పునర్నిర్మాణంలో భాగంగా.. స్టాఫ్​, ఇంజినీరింగ్​, మెటీరియల్​ మేనేజ్​మెంట్​ సభ్యుల పోస్టులను తొలగించినట్లు తెలిపింది కమిటీ. మంత్రివర్గ నిర్ణయం మేరకు.. రోలింగ్​ స్టాక్​ సభ్యుడినే.. మానవ వనరులు (హెచ్​ఆర్​) డీజీగా నియమించినట్లు వెల్లడించింది. రైల్వే ప్రణాళిక ప్రకారం.. ఛైర్మన్​, సీఈఓ.. హెచ్​ఆర్​ డీజీ సాయంతో మానవ వనరులకు బాధ్యత వహించే కేడర్​ కంట్రోలింగ్​ ఆఫీసర్​గా విధలు నిర్వర్తించనున్నారు.

పేర్లలో మార్పులు..

ఇండియన్​ రైల్వే మెడికల్​ సర్వీసెస్​ (ఐఆర్​ఎంఎస్​) పేరును.. ఇండియన్​ రైల్వే హెల్త్​ సర్వీసెస్​గా, రైల్వేలోని 8 విభాగాలను కలిపి.. ఇండియన్​ రైల్వే మేనేజ్​మెంట్​ సర్వీసెస్​ (ఐఆర్​ఎంఎస్​)గా మార్చే ప్రక్రియ జరుగుతోంది.

ఇదీ చూడండి: సుదూరంలోని గెలాక్సీని కనుగొన్న భారత శాస్త్రవేత్తలు

Last Updated : Sep 3, 2020, 6:57 AM IST

ABOUT THE AUTHOR

...view details