దేశంలోని వివిధ హైకోర్టులలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తి పదవి కోసం కొలీజియం, ప్రభుత్వం సిఫార్సు చేసిన అభ్యర్థి నియామకం ఆరు నెలల్లోగా చేపట్టాలని పేర్కొంది. ఈమేరకు డిసెంబర్ 6న జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
"హైకోర్టు కొలీజియం సిఫార్సులను... సుప్రీంకోర్టు కొలీజియం, ప్రభుత్వం ఆమోదించినట్లైతే వారి నియామకకం కనీసం ఆరు నెలల్లోగా జరిగిపోవాలి. హైకోర్టులలో మంజూరైన పోస్టులు 1079 ఉంటే... కేవలం 669 మంది మాత్రమే ప్రస్తుతం విధుల్లో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 410 ఖాళీలు ఉన్నాయి. హైకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన 213 పోస్టుల ప్రక్రియ కొనసాగుతోంది. 197 ఖాళీలకు హైకోర్టు కొలీజియం ఇంతవరకు సిఫార్సులు చేయలేదు."- సుప్రీంకోర్టు ఆదేశాలు