సాగు చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మోదీ సర్కారుకు మరోసారి విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. జనవరి 26న రైతుల ట్రాక్టర్ ర్యాలీలో హింసాత్మక ఘటనలు వెలుగుచూసిన నేపథ్యంలో ఈ మేరకు ట్వీట్ చేశారు.
'సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని కేంద్ర సర్కారుకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను' అంటూ హిందీలో ట్వీట్ చేశారు రాహుల్. దీనికి 'విదేయతతో ఉంటూనే.. ప్రపంచాన్ని కదిలించొచ్చు ' అని మహాత్మా గాంధీ వ్యాఖ్యలను జోడించారు.