భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్‌కు స్వాగతం పలికేందుకు వాఘా సరిహద్దుకు వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. జైహింద్ నినాదాలు, డప్పుచప్పుళ్లతో వాఘా-అఠారీ ప్రాంతం మార్మోగిపోతోంది. మువ్వన్నెల జెండాలతో పైలట్ రాకకోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
వాఘాలో 'జైహింద్' - pak
భారత వాయుసేన వింగ్ కమాండర్‌కు ఘన స్వాగతం పలికేందుకు వాఘా-అఠారీ సరిహద్దు సిద్ధమైంది.
ప్రజల కోలాహలం
తన కుమారుణ్ని చూసుకునేందుకు అభినందన్ తల్లిదండ్రులు సైతం వాఘాకు చేరుకున్నారు.
చిత్రమాలిక:ముస్తాబైన వాఘా