తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఇందిరను కీర్తించారు.. మోదీని ప్రశంసించరా?' - modi

బాలాకోట్​లో మెరుపు దాడులు నిర్వహించినందుకు ప్రధాని నేరంద్ర మోదీని ఎందుకు ప్రశంసించకూడదో చెప్పాలని  కేంద్ర హోంమంత్రి రాజ్​నాథ్ సింగ్ ప్రశ్నించారు. 1971లో పాకిస్థాన్​పై యుద్ధంలో భారత్​ విజయం సాధించినపుడు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని దేశమంతా కీర్తించిందని గుర్తు చేశారు రాజ్​నాథ్​.

ఇందిరాను కీర్తించారు.. మోదీని ప్రశంసించరా?: రాజ్​నాథ్​

By

Published : Mar 30, 2019, 2:09 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని కేంద్ర హోంమంత్రి రాజనాథ్​ సింగ్​ కొనియాడారు. కాంగ్రెస్​ పార్టీ 'చౌకీదార్​ చోర్'​ అంటూ చేస్తున్న విమర్శలను తీవ్రంగా తప్పు బట్టారు. 'చౌకీదార్​ చోర్' కాదు 'ప్యూర్'​ అని బదులిచ్చారు. మోదీ మరోసారి ప్రధాని కావడం కచ్చితమని ధీమా వ్యక్తం చేశారు రాజ్​నాథ్​.

అహ్మదాబాద్​లో అమిత్​ షా నామినేషన్​ సందర్భంగా నిర్వహించిన భాజపా విజయ సంకల్ప సభకు రాజ్​నాథ్​ హాజరయ్యారు. బాలాకోట్​లో భారత వాయుసేన మెరుపుదాడుల ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని పునరుద్ఘాటించారు.

సభలో మాట్లాడుతున్న రాజ్​నాథ్​ సింగ్​

"బాలాకోట్​లో మెరుపు దాడులపై రాజకీయం చేస్తున్నారు. ప్రధాన మంత్రి గొప్ప ఏముందని ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా.. 1971లో భారత్-పాక్ మధ్య యుద్ధం జరిగినపుడు మన బలగాలు వీరోచిత పోరాటంతో పాక్​ను మట్టికరిపించాయి. ఆ సమయంలో అటల్​ బిహారీ వాజ్​పేయీ సహా దేశమంతా ముక్త కంఠంతో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని కీర్తించారు. ఇప్పుడు 40 మంది సీఆర్​పీఎఫ్​ జవాన్లను బలిగొన్నందుకు ప్రతీకారంగా ప్రధాని భారత బలగాల శక్తి సామర్థ్యాలను చాటి చెప్పేందుకే వాయుసేనతో దాడులు నిర్వహించారు. ఈ విషయంలో ప్రధానిని ఎందుకు ప్రశంసించకూడదో చెప్పాలి."
-రాజ్​నాథ్​ సింగ్​, కేంద్ర హోంమంత్రి

ఇదీ చూడండి:'భారత్​ గెలుస్తోందని విపక్షాలకు అక్కసు'

ABOUT THE AUTHOR

...view details