తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శిల్పకళపై శిక్షణ..యువతకు ఉద్యోగ కల్పన - కెనరా బ్యాంకు

శిల్పకళలపై శిక్షణనిస్తూ యువతకు ఉద్యోగాల్ని కల్పిస్తుంది కర్ణాటక ఉడిపిలోని ఓ పాఠశాల. ఈ శిక్షణా పాఠశాలను కెనరా బ్యాంకు స్థాపించింది. ఇప్పటివరకు 900కు పైగా విద్యార్థులు ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.

శిల్పకళ

By

Published : Mar 25, 2019, 8:34 AM IST

శిల్పకళపై శిక్షణ..యువతకు ఉద్యోగ కల్పన
బ్యాంకు అనగానే ఆర్థిక లావాదేవీలే గుర్తొస్తాయి. అయితే కర్ణాటకలోని ఉడిపి వాసులకు మాత్రం కెనరా బ్యాంకు పేరు చెప్పగానే శిల్పాలను తయారు చేసే ప్రత్యేక పాఠశాల గుర్తొస్తుంది.

ఉడిపి దగ్గర్లోని మీరియా వద్ద శిల్పకళ శిక్షణ కోసం పాఠశాలను ఏర్పాటు చేసింది కెనరా బ్యాంకు. ఈ పాఠశాలలో ప్రవేశం పూర్తిగా ఉచితం. ఎంతోమంది నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చింది ఈ పాఠశాల.

1997 లో ప్రారంభం:

1997లో ఈ పాఠశాలను స్థాపించింది కెనరా బ్యాంకు. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ఈ పాఠశాలను ప్రారంభించారు. తొలినాళ్లలో సంవత్సరానికి 45 మందికి శిక్షణ ఇచ్చేవారు. ప్రస్తుతం 90 మందికి శిక్షణ ఇస్తున్నారు.

శిక్షణ వ్యవధి ఎంత..?

ఈ పాఠశాలలో శిక్షణా వ్యవధి ఒక సంవత్సరం. ఇందులో మొదటి 6 నెలలు చిత్రలేఖనం, తర్వాతి ఆరు నెలలు శిల్పాలు చెక్కటంపై తర్ఫీదునిస్తారు. లోహ శిల్పాలు, రాతి, చెక్క ,సిమెంట్​ శిల్పాలు తయారు చేయటంలో శిక్షణ ఉటుంది.

ఎంత మందికి ఉపాధి కల్పించింది..?

కెనరా బ్యాంకు, అంబాల సుబ్బారావు పాయ్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరుకు సుమారు 900కు పైగా పేద విద్యార్థులు ఇక్కడ శిక్షణ తీసుకుని ఉద్యోగాలు పొందారు. శిక్షణా సమయంలో శిల్పాలు చెక్కటానికి కావాల్సిన అన్ని పనిముట్లను పాఠశాలే అందిస్తుంది. అలాగే విద్యార్థులు తయారు చేసిన శిల్పాలు అమ్మగా వచ్చిన సొమ్ములో 25 శాతం వారికే చెల్లిస్తారు.

కేవలం శిక్షణే కాదు, విద్యార్థులు సొంతంగా వ్యాపారం ప్రారంభించుకునేందుకు వీలుగా బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తారు. శిక్షణ కోసం కర్ణాటకకు చెందిన విద్యార్థులే కాకుండా బయటి రాష్ట్రాలకు చెందిన వారూ వస్తారు. 7వ తరగతి ఉతీర్ణులై, 17 సంవత్సరాలు వయసు పూర్తైన వారు పాఠశాలలో చేరేందుకు అర్హులు.

ABOUT THE AUTHOR

...view details