తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పేదల పక్కా ఇళ్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్​ భేష్​ - ప్రధానమంత్రి ఆవాస్​ యోజన

దేశంలో ఇళ్లు లేని పేదలకు పక్కా ఇళ్లు కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్​ యోజన (పీఎమ్​ఏవై)లో నాలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్​, ఉత్తర​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​, పశ్చిమ్​ బంగ రాష్ట్ర ప్రభుత్వాలు మంచి పనితీరు కనబరిచినట్లు ఐసీఆర్​ఏ రేటింగ్​ ఏజెన్సీ వెల్లడించింది.

పేదల పక్కా ఇళ్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్​ భేష్​

By

Published : Aug 29, 2019, 6:47 AM IST

Updated : Sep 28, 2019, 4:48 PM IST

పేదల పక్కా ఇళ్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్​ భేష్​

ప్రధానమంత్రి ఆవాస్​ యోజన పథకం కింద పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయటంలో ఆంధ్రప్రదేశ్​, ఉత్తర్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​, పశ్చిమ్​ బంగ రాష్ట్రాలు మంచి పనితీరు కనబరిచినట్లు రేటింగ్​ ఏజెన్సీ 'ఐసీఆర్​ఏ' వెల్లడించింది. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఈ నాలుగు రాష్ట్రాలు ఎక్కువ ఇళ్లను పూర్తి చేసినట్లు పేర్కొంది.

2022 నాటికి ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్​, ఉత్తర్​ప్రదేశ్​ ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో సుమారు 3 లక్షల ఇళ్లు నిర్మించాయి.

ఏపీ, యూపీ రాష్ట్రాలు పీఎమ్​ఏవై-పట్టణ పథకంలో మంచి పనితీరు కనబరిచాయి. పీఎమ్​ఏవై-గ్రామీణ పథంకంలో ఎపీ, బెంగాల్​, యూపీ రాష్ట్రాలు రికార్డు స్థాయిలో అత్యధిక ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాయి.

ఇప్పటి వరకు పట్టణాలకు 81 లక్షల ఇళ్లు, గ్రామాల్లో కోటి ఇళ్లు మంజూరయ్యాయి. గృహ నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నట్లు నివేదిక వెల్లడించింది. ఇప్పటి వరకు మంజూరైన ఇళ్లలో కేవలం 32 శాతమే పూర్తయినట్లు తెలిపింది. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో పనితీరు మెరుగ్గా ఉందని ఐసీఆర్​ఏ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: రెండు నెలల్లో భారత్​తో యుద్ధం: పాక్ రైల్వే మంత్రి

Last Updated : Sep 28, 2019, 4:48 PM IST

ABOUT THE AUTHOR

...view details