తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దుస్సాహసానికి పాల్పడితే తగిన బదులిస్తాం' - కార్గిల్

'కార్గిల్ యుద్ధం ముగిసిన  20 ఏళ్ల తర్వాత' అనే అంశంపై దిల్లీలో నిర్వహించిన సదస్సులో భారత సైన్యాధిపతి బిపిన్​ రావత్ పాల్గొన్నారు. . పాకిస్థాన్‌ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా సమర్థంగా తిప్పికొడతామని హెచ్చరించారు. భవిష్యత్తులో యుద్ధాలు మరింత హింసాత్మకంగా, ఊహకందని విధంగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

'దుస్సాహసానికి పాల్పడితే తగిన బదులిస్తాం'

By

Published : Jul 14, 2019, 4:59 AM IST

Updated : Jul 14, 2019, 5:34 AM IST

పాక్‌ ఎలాంటి దుస్సాహసాలకు పాల్పడినా సమర్థంగా తిప్పికొడతామని భారత సైన్యాధిపతి బిపిన్​ రావత్ హెచ్చరించారు. దేశ వ్యతిరేకత శక్తుల పెరుగుదల, సాంకేతికత యుద్ధ గతిని మారుస్తుందని సైన్యాధిపతి అభిప్రాయపడ్డారు.

భవిష్యత్తులో యుద్ధాలు మరింత హింసాత్మకంగా, ఊహకందని విధంగా ఉండొచ్చన్నారు. ఈ యుద్దాల్లో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందన్న సైన్యాధిపతి యుద్ధం ఏ వైపు నుంచి వచ్చినా ఎదుర్కోవడానికి భద్రతా బలగాలు సంసిద్ధంగా ఉండాలన్నారు. కార్గిల్​ యుద్ధం ముగిసిన 20 ఏళ్ల తర్వాత అనే విషయంపై దిల్లీలో నిర్వహించిన సదస్సులో రావత్ ప్రసంగించారు.

'దుస్సాహసానికి పాల్పడితే తగిన బదులిస్తాం'

"పాకిస్థాన్ సైన్యం భారత్‌ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. దేశంలోకి చొరబాట్లను ప్రోత్సహిస్తూ ఉగ్రవాదులకు సహకరిస్తోంది. భారత భూభాగాన్ని రక్షించుకునేందుకు, దేశ సమగ్రతను కాపాడేందుకు భారత సైన్యం అప్రమత్తంగా ఉంది. పాకిస్థాన్‌ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా సమర్థంగా తిప్పికొడతాం. భవిష్యత్తులో జరిగే యుద్ధాలన్నీ హింసాయుతంగా, ఊహకు అందని విధంగా ఉంటాయి. వీటన్నింటికీ భారత సైన్యం సిద్ధంగా ఉండాలి. ఉరీ, పుల్వామా ఉగ్రదాడులు జరిగిన తర్వాత చేసిన మెరుపు దాడులు, వైమానిక దాడులు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకున్న రాజకీయ-సైనిక పరిష్కారం."
- బిపిన్​ రావత్​, భారత సైన్యాధిపతి

ఎవరూ చొరబడలేదు...

జమ్ముకశ్మీర్‌లోని లద్దాఖ్‌ వద్ద వాస్తవాధీన రేఖలోకి చైనా సైనికులు చొరబడినట్లు వచ్చిన వార్తలు నిజం కాదని భారత సైన్యాధిపతి బిపిన్‌ రావత్ తెలిపారు. జులై 6న దలైలామా జన్మదినం సందర్భంగా కొందరు టిబెటన్లు జెండాలను ఎగురవేయగా.. ఆ వేడుకలను చూసేందుకు చైనా సైనికులు వచ్చారన్నారు. ఎలాంటి చొరబాట్లు జరగలేదని స్పష్టం చేశారు.

Last Updated : Jul 14, 2019, 5:34 AM IST

ABOUT THE AUTHOR

...view details