దేశంలోని దాదాపు 18 కోట్ల మందిలో ఇప్పటికే కరోనావైరస్‌కు వ్యతిరేంగా యాంటీబాడీలు అభివృద్ధి అయినట్లు థైరోకేర్ సంస్థ తెలిపింది. భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ధ్రువీకరించిన టెస్టింగ్ సంస్థల్లో ఒకటైన థైరోకేర్.. యాంటీబాడీలపై ఓ నివేదికను వెల్లడించింది.
'18 కోట్లమందిలో యాంటీబాడీలు అభివృద్ధి' - ICMR latest update
భారత్లో 18కోట్ల మందిలో కరోనావైరస్తో పోరాడే యాంటీబాడీలు అభివృద్ధి అయినట్లు థైరోకేర్ సంస్థ తెలిపింది. ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది.
!['18 కోట్లమందిలో యాంటీబాడీలు అభివృద్ధి' Antibody developed in 18 million people in India: Thyrocare](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8119486-thumbnail-3x2-anitbodies.jpg)
18 కోట్లమందిలో యాంటీబాడీలు అభివృద్ధి: థైరోకేర్
దేశంలోని 600 పిన్‌కోడ్ ప్రాంతాల నుంచి 60 వేల యాంటీబాడీల టెస్టుల డేటాను పరిశీలించినట్లు థైరోకేర్ పేర్కొంది. దీని ద్వారా దేశంలో దాదాపు 15 శాతం ప్రజల్లో ఇప్పటికే ప్రతినిరోధకాలు అభివృద్ధి అయినట్లు తెలుస్తోందని వివరించింది. థైరోకేర్ సెంటర్ వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ వెలుమణి కూడా ఈ సమాచారాన్ని తన ట్విట్టర్‌లో పొందుపరిచారు.
ఇదీ చూడండి:చతుర్భుజి కూటమి నావికాదళం భారత్కు బలమేనా?