తెలంగాణ

telangana

By

Published : Oct 21, 2020, 1:12 PM IST

ETV Bharat / bharat

ట్రిపుల్ తలాక్​పై పోరాడిన మహిళకు కీలక పదవి

దేశంలోనే మొదటి సారిగా ట్రిపుల్ తలాక్ వ్యవస్థను ప్రశ్నించిన ముస్లిం మహిళ షయారా బానోకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం మంత్రి పదవిని కల్పించింది. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కార్యాలయ మీడియా ప్రతినిధి దర్శన్​ సింగ్​ రావత్ వెల్లడించారు. భాజపాలో చేరిన పది రోజులకే షయారాకు ఈ పదవి దక్కడం విశేషం.

Anti-triple talaq crusader Shayara Bano gets minister rank in Uttarakhand
ట్రిపుల్ తలాక్​పై పోరాడిన మహిళకు దక్కిన గౌరవం

ట్రిపుల్ తలాక్​ చట్టం తీసుకురావటంలో కీలకపాత్ర పోషించిన షయారా బానోకు ఉత్తరాఖండ్​ రాష్ట్ర మహిళా కమిషన్​లో ఉపాధ్యక్షురాలిగా చోటు కల్పించింది. ఆమెతోపాటు మరో ముగ్గురు మహిళలకూ అవకాశం దక్కింది. 'నవరాత్రి శుభ దినాన రాష్ట్ర మహిళలకు ఉత్తరాఖండ్​ సీఎం ఇచ్చే బహుమతి ఇది' అని సీఎం కార్యాలయ మీడియా ప్రతినిధి దర్శన్ సింగ్​ రావత్​ తెలిపారు.

ఉపాధ్యక్షులు వీరే..

  • షయారా బానో - ఉద్దమ్​ సింగ్​ నగర్​ జిల్లా , ఉత్తరాఖండ్​
  • జ్యోతీషా , రాణీఖేట్- అల్మోరా జిల్లా , ఉత్తరాఖండ్
  • పుష్ప పాసవాన్- చమోలీ జిల్లా , ఉత్తరాఖండ్​

2014లో ట్రిపుల్ తలాక్​ పై సుప్రీంకోర్టులో పోరాడిన మొదటి ముస్లిం మహిళగా షయానా బానోకు గుర్తింపు ఉంది. పదిరోజుల క్రితం ఆమె ఉత్తరాఖండ్​ భాజపా అధ్యక్షుడు బన్సీధర్ భగత్ సమక్షంలో పార్టీలో చేరారు.

ABOUT THE AUTHOR

...view details