దిల్లీ వీధుల్లో గాలిని శుభ్రపరిచే 'గన్స్' - anti smog guns to control pollution in delhi
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. కాలుష్య తీవ్రత పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో కాలుష్యాన్ని నియంత్రించేందుకు దిల్లీ అధికారులు వినూత్న ప్రయోగం చేశారు. 'యాంటీ స్మాగ్ గన్స్'ను నగరంలో ఏర్పాటు చేస్తున్నారు.
![దిల్లీ వీధుల్లో గాలిని శుభ్రపరిచే 'గన్స్' Anti-smog guns deployed at several locations in the national capital, as part of measures being taken to control pollution](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9293728-624-9293728-1603520703603.jpg)
దిల్లీ వీధుల్లో గాలిని శుభ్రపరిచే 'గన్స్'
దిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు అధికారులు వినూత్న చర్యలు చేపట్టారు. వాతావరణంలో ఉన్న హానికారక వాయువులను తొలగించేందుకు 'యాంటీ స్మాగ్ గన్స్'ను ఉపయోగిస్తున్నారు. కాలుష్యాన్ని తొలగించే రసాయనాన్ని గాలిలోకి విడుదల చేయటం ద్వారా.. గాలిని శుభ్రపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం దిల్లీలోని ఐటీఓ ప్రాంతంలో యాంటీ స్మాగ్ గన్స్ ఉపయోగిస్తున్నారు.
దిల్లీ వీధుల్లో యాంటీ స్మాగ్ గన్స్ ఏర్పాటు