తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్, అసోం ప్రశాంతం- 3వ రోజూ దీదీ ర్యాలీ

'పౌర' చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలతో కొన్ని రోజులుగా అట్టుడికిపోతున్న అసోం, బంగాల్​లో బుధవారం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూను సడలించారు. వరుసగా మూడో రోజు కోల్​కతాలో నిరసన ర్యాలీ నిర్వహించారు మమత.

anti-caa-stir-bengal-assam-peaceful-mamata-to-hold-rally
బంగాల్, అసోం ప్రశాంతం- 3వ రోజూ దీదీ ర్యాలీ

By

Published : Dec 18, 2019, 5:50 PM IST


పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలతో అట్టుడుకుతున్న అసోం, బంగాల్​లో బుధవారం ప్రశాంత వాతావరణం నెలకొంది. అసోం రాజధాని గువాహటి, మేఘాలయ రాజధాని షిల్లాంగ్​లో ఉదయం 6 గంటల నుంచి 14 గంటల పాటు కర్య్ఫూను సడలించారు. దీంతో వ్యాపార సముదాయాలు, బ్యాంకులు తిరిగి తెరుచుకున్నాయి. విద్యాసంస్థలు మాత్రం ఇంకా మూతపడే ఉన్నాయి. మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునఃరుద్ధరించలేదు.

దీదీ ర్యాలీ

పౌరసత్వ చట్ట సవరణ, దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీ అమలును వ్యతిరేకిస్తూ వరుసగా మూడో రోజు కోల్​కతాలో ర్యాలీ నిర్వహించారు బంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. హావ్​డా మైదానం నుంచి ఎస్​ప్లెనేడ్​ వరకు వేలాది మందితో కలిసి పాదయాత్ర చేశారు.

పౌరసత్వ చట్ట సవరణతో దేశంలో చిచ్చు రేగిందని, దానిని ఆర్పాల్సిన బాధ్యత కేంద్ర హోంమంత్రి అమిత్​షాదేనని అన్నారు మమత.

ABOUT THE AUTHOR

...view details