తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పైసా వసూల్​'పై యోగి సర్కార్​కు సుప్రీం తాఖీదులు - anti caa protest

సీఏఏకు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు చేపట్టిన వారి నుంచి నష్ట పరిహారం వసూలు చేయడంపై యూపీ ప్రభుత్వ వివరణ కోరింది సుప్రీం. యోగి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ దాఖలైన వ్యాజ్యాన్ని పరిశీలించిన న్యాయస్థానం... ఈమేరకు నోటీసులు జారీ చేసింది.

anti-caa-protests-sc-notice-to-up-govt-on-plea-for-quashing-of-notices-for-recovering-damages
'పైసా వసూల్​'పై యోగి సర్కార్​కు సుప్రీం తాఖీదులు

By

Published : Jan 31, 2020, 2:32 PM IST

Updated : Feb 28, 2020, 3:52 PM IST

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారి నుంచి నష్టపరిహారం వసూలు చేయడంపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నష్టపరిహారం చెల్లించాలంటూ నోటీసులు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపింది సుప్రీంకోర్టు. దీనిపై అభిప్రాయం చెప్పాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

యూపీలో హింసాత్మక నిరసనలకు పాల్పడ్డ కేసుల్లో ఇప్పటికే 925 మంది అరెస్ట్​ అయ్యారు. అయితే.. యూపీ ప్రభుత్వం నిరంకుశ మార్గంలో ఆరేళ్ల క్రితం చనిపోయిన 94 ఏళ్ల వ్యక్తి పేరిట నష్టపరిహారం చెల్లించాలని నోటీసులు జారీ చేసిందని పిటిషనర్లు ఆరోపించారు. 90 ఏళ్లకు పైగా వయసున్న మరో ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేశారని వివరించారు. ఎలాంటి నేర చరిత్ర, కేసులు లేని వారికీ తాఖీదులు ఇచ్చారని తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా అలహాబాద్‌ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పు ప్రకారం యూపీ ప్రభుత్వం ఈ నోటీసులు జారీ చేసిందని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.

ఇదీ చదవండి:ఆ ఉన్మాది భార్యను రాళ్లతో కొట్టి చంపారు!

Last Updated : Feb 28, 2020, 3:52 PM IST

ABOUT THE AUTHOR

...view details