తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిదంబరానికి త్రుటిలో తప్పిన ప్రమాదం! - చిదంబరానికి తప్పిన ప్రమాదం-వేదికపై కూలిన ఫ్లెక్సీ బోర్డు

కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. చెన్నైలో జరిగిన పౌరచట్ట వ్యతిరేక సమావేశంలో వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లైక్సీ బోర్డు కూలింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదని సమాచారం. ఫ్లెక్సీ కూలినప్పుడు సభలో చిదంబరం ప్రసంగిస్తున్నారని తెలుస్తోంది.

chidambaram
చిదంబరానికి తప్పిన ప్రమాదం-వేదికపై కూలిన ఫ్లెక్సీ బోర్డు

By

Published : Feb 23, 2020, 11:55 PM IST

Updated : Mar 2, 2020, 8:45 AM IST

కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన ఓ పౌరచట్ట వ్యతిరేక సమావేశానికి హాజరయ్యారు చిదంబరం. అయితే వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బోర్డు ప్రమాదవశాత్తు కూలింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. ఫ్లెక్సీ బోర్డు కూలిన సమయంలో సభలో చిదంబరం ప్రసంగిస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అయితే నిర్వాహకులు వేగంగా స్పందించి ఫ్లెక్సీ బోర్డు సరిచేశారని.. చిదంబరం తన ప్రసంగాన్ని కొనసాగించారని సమాచారం.

ఇదీ చూడండి: పీజీ పట్టభద్రుడి భిక్షాటన.. ఎందుకో తెలుసా?

Last Updated : Mar 2, 2020, 8:45 AM IST

ABOUT THE AUTHOR

...view details