తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కశ్మీర్​ ఆంక్షలపై ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పాల్సిందే'

కశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు అనంతరం విధించిన ఆంక్షలపై అడిగే ప్రతి ప్రశ్నకు జమ్ముకశ్మీర్​ అధికార యంత్రాంగం సమాధానం చెప్పాల్సిందేనని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. కశ్మీర్​లో ఆంక్షలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

'కశ్మీర్​ ఆంక్షలపై ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పాల్సిందే'

By

Published : Nov 21, 2019, 12:47 PM IST

Updated : Nov 21, 2019, 3:44 PM IST

'కశ్మీర్​ ఆంక్షలపై ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పాల్సిందే'

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో విధించిన ఆంక్షలపై లేవనెత్తే ప్రతి ప్రశ్నకూ సమాధానం ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆంక్షలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై జస్టిస్‌ ఎన్​వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది.

విచారణకు కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు సుప్రీం కోర్టు పలు విషయాలపై స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

" మిస్టర్​ మెహతా.. కశ్మీర్​లో ఆంక్షలపై పిటిషనర్లు సంధించే ప్రతి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునేందుకు మీరు దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్ ఎలాంటి సాయం చేయలేదు. ఈ అంశంపై మీరు సరైన దృష్టి సారించడం లేదనే భావనను కల్పించరాదు."
- సుప్రీం ధర్మాసనం

సుప్రీం వ్యాఖ్యలపై సొలిసిటర్​ జనరల్​ స్పందిస్తూ... ఆంక్షలపై దాఖలైన పలు పిటిషన్లలో అవాస్తవాలు ఉన్నాయన్నారు. వాదన జరిగే సమయంలో ప్రతి అంశంపైనా స్పందిస్తానని తెలిపారు. జమ్ముకశ్మీర్​లో పరిస్థితులు రోజురోజుకు మారుతున్నాయని.. అందుకే అక్కడి స్థితిగతులపై నివేదిక ఉన్నప్పటికీ న్యాయస్థానానికి సమర్పించలేదని ధర్మాసనానికి వివరించారు. ఆ నివేదిక సమర్పించే సమయంలో కశ్మీర్​ వాస్తవ పరిస్థితులను కోర్టుకు తెలియజేస్తానని స్పష్టం చేశారు.

నిర్బంధంపై దాఖలైన పిటిషన్లను ప్రస్తుతం విచారించడం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆంక్షలపై దాఖలైన పిటిషన్లకే పరిమితం అవుతున్నట్లు తెలిపింది.

Last Updated : Nov 21, 2019, 3:44 PM IST

ABOUT THE AUTHOR

...view details