తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాడులో విస్త్రతంగా ఎన్​ఐఏ సోదాలు - ఎన్​ఐఏ

శనివారం ఉదయం తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో ఎన్​ఐఏ సోదాలు నిర్వహించింది. అన్సరుల్లా​ ఉగ్రసంస్థ కేసు విచారణలో భాగంగా తనిఖీలు చేపట్టినట్టు ప్రకటించింది.

తమిళనాడులో విస్త్రతంగా ఎన్​ఐఏ సోదాలు

By

Published : Jul 20, 2019, 10:58 AM IST

తమిళనాడులో విస్త్రతంగా ఎన్​ఐఏ సోదాలు

అన్సరుల్లా​ ఉగ్రసంస్థ కేసు విచారణలో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) శనివారం తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఎన్​ఐఏ ప్రత్యేక కోర్టు 16 మందికి 8 రోజుల కస్టడీ విధించిన ఒక్క రోజులోనే ఈ సోదాలు చేపట్టారు అధికారులు. రాష్ట్రంలో అన్సరుల్లా​ ఉగ్రవాద సంస్థను స్థాపించడానికి ప్రయత్నించారన్న ఆరోపణలతో వీరందరూ అరెస్టయ్యారు.

చెన్నై, మదురై, తిరునెల్వెలి, రామనాథపురం జిల్లాల్లో ఈ సోదాలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా సేకరించిన ఆధారాలను ధ్రువీకరించడానికి నిందితులను వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి వచ్చిందని వివరించారు.

అల్​ఖైదాకు మద్దతు...

అన్సరుల్లా కేసు నేపథ్యంలో సౌదీ ఆరేబియాలో తలదాచుకుంటున్న 14 మందిని ఆ దేశం గత వారం భారత్​కు పంపింది. ఆ సమయంలోనే వారిని ఎన్​ఐఏ అదుపులోకి తీసుకుంది. మరో ఇద్దరిని గత శనివారం తమిళనాడులోనే పట్టుకుంది.

అదుపులోకి తీసుకున్న 16 మంది... ఐఎస్​ఐఎస్​, అల్​ఖైదా ఉగ్రసంస్థలకు మద్దతిస్తున్నారని ఎన్​ఐఏ పేర్కొంది.

ఇదీ చూడండి:- 'ధోనీ రిటైర్మెంట్​ ఇప్పుడే కాదులే...'

ABOUT THE AUTHOR

...view details