తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​: ఉగ్రవాదుల దుశ్చర్యకు మరో డ్రైవర్​ బలి - jammu kashmir union territory

కశ్మీర్​లో వాహన చోదకులే లక్ష్యంగా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. దక్షిణ కశ్మీర్​లోని అనంత్​నాగ్ జిల్లాలో ఓ డ్రైవర్​పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

కశ్మీర్​లో ముష్కరుల కాల్పులు-వాహన చోదకుడి మృతి

By

Published : Oct 28, 2019, 10:50 PM IST

Updated : Oct 28, 2019, 11:46 PM IST

ఐరోపా సమాఖ్య ఎంపీలు జమ్ముకశ్మీర్​లో పర్యటించడానికి ఒక్క రోజు ముందు.. ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. దక్షిణ కశ్మీర్​లోని అనంత్​నాగ్​ జిల్లాలో ముష్కరులు జరిపిన కాల్పుల్లో నారాయణ్​దత్​ అనే వాహన చోదకుడు మృతి చెందాడు. మృతుడు ఉదంపుర్​ జిల్లా కాట్రా నివాసి.

అనంత్​నాగ్​లోని బిజ్​బెహరా ప్రాంతం.. కనిల్వాన్​లో నారాయణ దత్​పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమీపంలోనే ఉన్న పోలీసు అధికారి వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నందువల్ల మరో ఇద్దరు చోదకులు ప్రాణాలతో బయటపడ్డారు.

ఉగ్రవాదుల కోసం ఆయా ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.

ఆర్టికల్ రద్దు అనంతరం ముష్కరమూకలు వాహన చోదకులపై జరిపిన దాడిలో ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్​కు చెందిన ఓ వ్యాపారి, కశ్మీర్​లో పనికోసం వచ్చిన మరో వ్యక్తి ముష్కరమూకల దాడికి బలయ్యారు.

ఇదీ చూడండి: ఔదార్యం: 37 ఏళ్లుగా ఆయన ఏం చేస్తున్నారో తెలుసా..!

Last Updated : Oct 28, 2019, 11:46 PM IST

ABOUT THE AUTHOR

...view details