తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వృద్ధ రైతు సైకిల్ యాత్ర- 24 గంటల్లో 250 కి.మీ - దిల్లీ రైతుల నిరసన

దిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతిచ్చేందుకు అమర్​జీత్ సింగ్ అనే వృద్ధ రైతు సైకిల్​పై 24 గంటల్లో 250 కి.మీ ప్రయాణించారు. చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

another-sexagenerian-cycles-to-join-farmers-protest-in-delhi
వృద్ధ రైతు సైకిల్ యాత్ర- 24 గంటల్లో 250 కి.మీ

By

Published : Dec 22, 2020, 10:58 AM IST

నూతన వ్యవసాయ చట్టాల వ్యతిరేక పోరులో తానూ గళం వినిపించడానికి ఓ రైతు ఏకంగా 24 గంటల్లో 250 కి.మీ. సైకిల్​పై ప్రయాణించారు. పాటియాలాకు చెందిన 67 ఏడేళ్ల అమర్​జీత్ సింగ్​ అనే రైతు.. తన సొంత ఊరి నుంచి నిరసన ప్రాంతానికి పయనమై వచ్చారు. ఆయనతో పాటు మరో పది మంది సైతం 24 గంటల వ్యవధిలోనే దిల్లీకి చేరుకున్నారు.

సైకిళ్లపై రైతులు
సైకిల్​పై వస్తున్న అమర్​జీత్ సింగ్

పంజాబ్​లో చీఫ్ ఇంజినీర్​గా పనిచేశారు అమర్​జీత్ సింగ్. పదవీ విరమణ తర్వాత వ్యవసాయం చేస్తున్నారు. రైతులకు మద్దతు తెలిపేందుకు తన స్నేహితులతో కలిసి వచ్చినట్లు తెలిపారు అమర్​జీత్. మూడు చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వృద్ధ రైతు సైకిల్ యాత్ర- 24 గంటల్లో 250 కి.మీ

"నా వయసు ఉన్న వ్యక్తి సైకిల్​పై వస్తే ఇక్కడ నిరసన చేస్తున్న రైతులకు ఉత్సాహం లభిస్తుంది. ఇళ్లలో ఉన్నవారికి కూడా ఆందోళనలో పాల్గొనేందుకు ప్రేరణ ఇస్తుంది. తద్వారా ఆందోళన ఉద్ధృత రూపం సంతరించుకుంటుంది. ఆందోళన స్థాయి పెరిగితే ప్రభుత్వం దిగి వస్తుంది."

-అమర్​జీత్ సింగ్, రైతు

లాక్​డౌన్ సమయంలో పార్లమెంట్​లో చర్చించకుండానే చట్టాలను ఆమోదించారని అన్నారు అమర్​జీత్. రైతుల పోరాటం తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

సరిహద్దులో బైఠాయించిన రైతులు
వృద్ధ రైతు సైకిల్ యాత్ర- 24 గంటల్లో 250 కి.మీ

ఇదీ చదవండి:చలిని లెక్కచేయకుండా.. సాగుతున్న రైతన్న పోరాటం

ABOUT THE AUTHOR

...view details