కంబళ పరుగులో సరికొత్త రికార్డు నమోదైంది. మెరుపు వేగంతో పరుగులు తీయడంలో బైందూరు విశ్వనాథ్(30) పాత రికార్డులు తిరగరాశారు. కర్ణాటకలోని మంగళూరు సమీపం ముల్కి వద్ద సనివారం నిర్వహించిన ఐకళ కాంతాబారె బూదాబారె కంబళలో ఆయన దున్నపోతుల వెంట వంద మీటర్ల దూరాన్ని 9.15సెకన్లలో చేరుకుని రికార్డు సృష్టించారు.
9.15 సెకన్లలో 100 మీటర్ల 'కంబళ' పరుగు - బైందూరు విశ్వనాథ్
9.15 సెకన్లలోనే 100 మీటర్లు పరిగెత్తు కంబళ పోటీల్లో రికార్డు సృష్టించారు 30ఏళ్ల బైందూరు విశ్వనాథ్. శ్రీనివాస గౌడ పేరు మీదున్న 9.55 సెకన్ల రికార్డును తిరగరాశారు.
9.15 సెకన్లలో 100 మీటర్ల 'కంబళ' పరుగు
ఇప్పటివరకు శ్రీనివాస గౌడ పేరుమీదు 9.55 సెకన్ల రికార్డు ఉండేది. కొత్త రికార్డు సృష్టించిన విశ్వనాథ్‌ను శ్రీనివాసగౌడ అభినందిస్తూ.. ఇదొక అసాధారణమైన పరుగు అని అభివర్ణించారు. విశ్వనాథ్ రికార్డును ఆటోస్టార్ట్, సెన్సార్ ద్వారా నమోదు చేసినందున పొరపాటుకు అవకాశం ఉండదని నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి:-కంబళ వీరుడు శ్రీనివాస.. ఈసారి ఓడిపోయాడు