తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు కశ్మీర్ పర్యటన​కు మరో విదేశీ బృందం

జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఆ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను అంచనా వేసేందుకు ఐరోపా సమాఖ్య, గల్ఫ్ ప్రతినిధులు నేడు ఆ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. పౌరసమాజం, భద్రతాసిబ్బంది, రాజకీయ నేతలతో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఓ ఎంపీల బృందం కశ్మీర్​లో పర్యటించింది.

Another foreign group to tour Kashmir today
నేడు కశ్మీర్ పర్యటన​కు మరో విదేశీ బృందం

By

Published : Feb 12, 2020, 5:58 AM IST

Updated : Mar 1, 2020, 1:16 AM IST

నేడు కశ్మీర్ పర్యటన​కు మరో విదేశీ బృందం

జమ్ముకశ్మీర్​లో పర్యటించడానికి మరో విదేశీ బృందం సన్నద్ధమవుతోంది. ఐరోపా సమాఖ్య, గల్ఫ్ దేశాలకు చెందిన రాయబారుల బృందం.. నేటి నుంచి రెండురోజుల పాటు కశ్మీర్​లో పర్యటించనుంది. ఆర్టికల్​ 370 రద్దు అనంతర పరిస్థితులను సమీక్షించనుంది. పౌరసమాజం, భద్రతా సిబ్బంది, నిర్బంధంలో ఉన్న రాజకీయ నేతలతో బృందంలోని ప్రతినిధులు సమావేశం కానున్నారు. పౌరసత్వ చట్ట సవరణ, కశ్మీర్​ అంశంపై గత నెలలో ఈయూ పార్లమెంట్​లో జరిగిన చర్చపై ఓటింగ్​ నిర్వహించే అవకాశాలున్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే కశ్మీర్​లో పర్యటించాలని విదేశీ బృందాన్ని భారత ప్రభుత్వం ముందే కోరింది. కానీ ఈ విషయంపై చర్చించాలంటూ కశ్మీర్​ పర్యటన విజ్ఞప్తిని తిరస్కరించారు రాయబారులు.

ఇప్పటివరకు...

ఇంతకుముందే ఐరోపా సమాఖ్యకు చెందిన 23 మంది ఎంపీలు కశ్మీర్​ను సందర్శించారు. అయితే నాటి పర్యటనపై ఇంటర్నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ నాన్​-అలైన్డ్​ స్టడీస్ విమర్శలు చేసింది. కేవలం ఒక వర్గం వారినే ప్రభుత్వం ఈ పర్యటనకు ఆహ్వానించిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అప్పటి ప్రతినిధుల పర్యటనకు ప్రభుత్వం దూరంగా ఉంది. ఐరోపా సమాఖ్య పార్లమెంట్ సభ్యుల పర్యటన వారి వ్యక్తిగతమైనదని వెల్లడించింది.

ఇదీ చూడండి:జీరో ఎఫెక్ట్​: దిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీనామా

Last Updated : Mar 1, 2020, 1:16 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details