తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్​ పిటిషన్​ - 'Nirbhaya' case

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులు ఉరి నుంచి తప్పించుకోవడానికి తమకున్న అన్ని అవకాశాలనూ ఉపయోగించుకుంటున్నారు. ఇదివరకే.. దోషులు వినయ్​​, ముకేశ్​లు దాఖలు చేసిన క్యురేటివ్​ పిటిషన్లను సుప్రీం కొట్టివేయగా.. తాజాగా మరో దోషి అక్షయ్​ కుమార్​ కూడా​ సుప్రీం కోర్టులో ఇదే​ పిటిషన్​ దాఖలు చేశాడు.

akshay
'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్​ పిటిషన్​

By

Published : Jan 28, 2020, 11:43 PM IST

Updated : Feb 28, 2020, 8:25 AM IST

ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు నిర్భయ దోషులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. న్యాయపరంగా తమకున్న చివరి అవకాశమైన క్యురేటివ్​ పిటిషన్​ను ఒకరి తరువాత ఒకరు వినియోగించుకుంటున్నారు. ఇంతకుముందే.. నిర్భయ దోషులు వినయ్​, ముకేశ్​లు ఈ వ్యాజ్యాన్ని ఉపయోగించుకున్నారు.వారి పిటిషన్లను కోర్టు కొట్టివేయగా.. తాజాగా మరో దోషి అక్షయ్​ కుమార్​ కూడా క్యురేటివ్​ పిటిషన్​ దాఖలు చేశాడు. తనకు విధించిన ఉరిశిక్షపై స్టే విధించాలని అభ్యర్థించాడు.

దేశ రాజధాని దిల్లీలో సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో మరణశిక్ష విధించిన నలుగురిలో ఒకరు అక్షయ్​ కుమార్​.

క్యురేటివ్​ పిటిషన్​

క్యురేటివ్​ పిటిషన్​ అనేది.. న్యాయపరంగా ఒక వ్యక్తికి అందుబాటులో ఉన్న చివరి సహాయం. ఈ పిటిషన్​అరుదైన, ప్రత్యేక కేసుల్లోనే అందుబాటులో ఉంటుంది. క్యురేటివ్​ పిటిషన్​పై విచారణ రహస్యంగా జరుగుతుంది.

క్యురేటివ్​ పిటిషన్లనే కాకుండా నిర్భయ దోషులు క్షమాభిక్ష పిటిషన్లనూ వినియోగించుకుంటూ.. శిక్ష అమలు ఆలస్యమయ్యేలా చేస్తున్నారు. ఇప్పటికే ముకేశ్.. తన క్షమాభిక్ష పిటిషన్​ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్​ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్​పై తీర్పును బుధవారానికి వాయిదా వేసింది కోర్టు.

ఫిబ్రవరి 1వ తేదీన నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలుకావాల్సి ఉంది. దోషులు వరుసగా పిటిషన్లు వేస్తున్న తరుణంలో వీరికి మరణ శిక్ష మరోసారి వాయిదా పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి : నిర్భయ దోషి పిటిషన్​పై రేపు సుప్రీం తీర్పు

Last Updated : Feb 28, 2020, 8:25 AM IST

ABOUT THE AUTHOR

...view details