కొద్ది రోజుల్లో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 65 స్థానాల్లో ఉపఎన్నికలను నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో 64 అసెంబ్లీ స్థానాలు కాగా ఒకటి లోక్సభ స్థానం. ఎన్నికలు సజావుగా సాగేందుకు బలగాల తరలింపు, శాంతిభద్రతల నిర్వహణ తదితర అంశాల రీత్యా పోలింగ్ ఒకేసారి జరపనున్నట్లు తెలిపింది. ఈ ఎన్నికల షెడ్యూళ్లను సరైన సమయంలో ప్రకటిస్తామని ఈసీ చెప్పింది.
బిహార్ అసెంబ్లీతో పాటే ఆ 65 స్థానాల్లో ఎన్నికలు
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బిహార్ ఎన్నికలతో పాటే దేశంలో వివిధ రాష్ట్రాల్లో వాయిదా పడ్డ 64 అసెంబ్లీ స్థానాలకు, ఒక లోక్సభ స్థానానికి ఉపఎన్నికలు జరపాలని నిర్ణయించింది.
బిహార్ అసెంబ్లీతో పాటే ఆ 65 స్థానాల్లో ఎన్నికలు
బిహార్ అసెంబ్లీ గడువు ఈ ఏడాది నవంబర్ 29తో ముగియనుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్- నవంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
కరోనా వ్యాప్తి సహా భారీ వర్షాల కారణంగా ఇటీవల పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికలను ఈసీ వాయిదా వేసింది.
- ఇదీ చూడండి:ఆ పరీక్షలు ఆపడంపై రాహుల్, ప్రియాంక ఫైర్