తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య రామాలయ నిర్మాణం కోసం విరాళాల వెల్లువ - अयोध्या राम मंदिर

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి రూ.1.25 కోట్ల విరాళం ప్రకటించింది ఉత్తర్​ప్రదేశ్​ మథురలోని ముకుట్​ ముఖారవింద్​ మందిర్​ ట్రస్ట్​. ఆలయ నిర్మాణంలో పాలుపంచుకునేందుకు 100 మంది కరసేవకులను పంపాలని నిర్ణయించింది.

అయోధ్య రామాలయ నిర్మాణం కోసం విరాళాల వెల్లువ

By

Published : Nov 18, 2019, 5:07 PM IST

అయోధ్యలో రామ మందిరంపై దశాబ్దాల వివాదానికి తెరదించుతూ కొద్ది రోజుల క్రితం సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం చేసింది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రామ మందిర నిర్మాణంలో పాలు పంచుకునేందుకు పలువురు వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముందుకు వచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారు.

ఆలయ నిర్మాణానికి విరాళం ప్రకటించింది ఉత్తర్​ప్రదేశ్​ మథురలోని ముకుట్ ముఖారవింద్​ మందిర్​ ట్రస్ట్​.

రమాకాంత్​ గోస్వామి

"రామమందిర నిర్మాణానికి రూ.1.25 కోట్ల విరాళం ఇవ్వాలని అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. ఆలయ నిర్మాణ సమయంలో వంద మంది కరసేవకులను అయోధ్యకు పంపించి సేవ చేయాలని నిర్ణయించాం. విరాళాలు ఇచ్చేందుకు తిరుపతి బాలాజీ, సిద్ధి వినాయక వంటి ప్రముఖ ఆలయాల నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయి. అందరి సమ్మతితో రామాలయానికి విరాళం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం."
- రమాకాంత్​ గోస్వామి, ముకుట్​ ముఖారవింద్​ మందిర్​ ట్రస్ట్​

ఇదీ చూడండి: మహా ప్రతిష్టంభన వేళ ఎన్సీపీపై ప్రధాని పొగడ్తలు

ABOUT THE AUTHOR

...view details