ఫేస్‌బుక్ భారత పబ్లిక్ పాలసీ హెడ్ పదవి నుంచి అంఖీ దాస్ తప్పుకున్నారు. ఈ మేరకు ఆ సంస్థకు చెందిన ఉన్నతాధికారి ఒకరు స్వయంగా వెల్లడించారు. గత కొంతకాలంగా విద్వేషపూరిత ప్రసంగాలు, కంటెంట్ నిర్వహణ విషయంలో ఫేస్‌బుక్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో దాస్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
అంఖీ దాస్ ఫేస్‌బుక్ నుంచి వైదొలిగారు. సంస్థ భారత్‌లో అడుగుపెట్టినప్పుడు చేరిన ఉద్యోగుల్లో ఆమె ఒకరు. తొమ్మిది సంవత్సరాలుగా సంస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
-అజిత్ మోహన్ ,ఫేస్‌బుక్ ఇండియా ఎండీ
ఇకపై ప్రజాసేవలో...
ఫేస్‌బుక్‌కి రాజీనామా చేసిన అంఖీ దాస్ ఇకపై ప్రజాసేవలోకి రానున్నట్లు వీడ్కోలు సమావేశంలో తెలిపారు. 2011లో సంస్థలో చేరినప్పటి తన అనుభవాలను నెమరు వేసుకున్నారు. దేశంలో ప్రజలను కలిపే దిశగా మేము నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకున్నట్లు తెలిపారు. ప్రపంచానికి ఓ అద్భుతాన్ని అందించిన మార్క్ జూకర్ బర్గ్‌కి ధన్యవాదాలు తెలియజేశారు.
ఇదీ చూడండి: ఫేస్‌బుక్, వాట్సాప్‌పై దర్యాప్తునకు రాహుల్ డిమాండ్