తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్రను వణికిస్తున్న భారీ వర్షాలు

మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ వర్షం ధాటికి పలుచోట్ల గోడలు, చెట్లు, విద్యుత్​ స్తంభాలు నేలకొరిగాయి. ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సహాయకచర్యలు చేపడుతున్నారు.

By

Published : Jun 29, 2019, 8:14 PM IST

ముంబయిని వణికిస్తున్న భారీ వర్షాలు

ముంబయిని వణికిస్తున్న భారీ వర్షాలు

మహారాష్ట్రలో రెండో రోజూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రైళ్లు, బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ భారీ వర్షం ధాటికి మరోల్​ ప్రాంతంలోని అంధేరీ హౌసింగ్​ సొసైటీ వద్ద గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడ ఉన్న కార్లు ధ్వంసం అయ్యాయి.

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దాదర్​, గోవంది వద్ద గోడలు కూలి... ఐదుగురు క్షతగాత్రులయ్యారు. నగరంలోని పలుచోట్ల విద్యుత్​ స్తంభాలు నేలకొరిగాయి. 39 చోట్ల షార్ట్​సర్క్యూట్​, 104 చోట్ల చెట్లు నేలకొరిగినట్లు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. సహాయక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి: కన్న బిడ్డ కోసం.... విధ్వంసం సృష్టించారు

ABOUT THE AUTHOR

...view details