వృద్ధాప్యంలో అమ్మకు అనంతమైన ప్రేమను పంచిన కర్ణాటకకు చెందిన తనయుడికి.. కారు బహూకరించారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా.
కర్ణాటకలోని మైసూర్ బొగాడికి చెందిన డి. కృష్ణ కుమార్... తల్లి చూదరత్నకు దేశంలో అన్ని పుణ్య క్షేత్రాలు తిప్పి చూపించాలనుకున్నాడు. ఉద్యోగం మానేసి.. 20 ఏళ్ల క్రితం నాటి పాత స్కూటర్‌పై మాతృసేవా సంకల్ప్ యాత్ర చేపట్టాడు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లాడు. మాతృమూర్తి రుణం తీర్చుకునే ప్రయత్నం చేసిన..'ఆ వ్యక్తిని పరిచయం చేస్తే.. కారు గిఫ్ట్‌గా ఇస్తా' అని గతేడాది అక్టోబర్‌లో ట్విట్టర్ ద్వారా ప్రకటించారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా.