దిల్లీలో మొదటిసారిగా ఆక్సిజన్ విక్రయించే 'ఆక్సీప్యూర్' బార్ ప్రారంభమైంది. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ వచ్చి ప్రాణవాయువును పీల్చుకుంటున్నారు.
కాలుష్యం వల్లే
వాయు కాలుష్యంతో సతమతమవుతున్న దిల్లీలో ప్రజలు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి నెలకొంది. గాలి నాణ్యత సూచీ రోజురోజుకూ దిగజారిపోతున్న నేపథ్యంలో స్వచ్ఛమైన గాలి పీల్చాలంటే డబ్బులు వెచ్చించాల్సిన దుస్థితి దాపురించింది. అందుకే, ప్రజల అవసరాల మేర ఇలా ఆక్సిజన్ బార్లు తెరుచుకుంటున్నాయి.
ఈ బార్లో బీర్ ఉండదు.. ఆక్సిజన్ మాత్రమే లభ్యం! మాంచి వాసనొచ్చే వాయువు
ఇక్కడ ఆక్సిజన్ అంటే అదేదో ఆసుపత్రిలో పెట్టినట్టు పేలగా ఉంటుందనుకుంటున్నారేమో. లెమన్‌గ్రాస్, ఆరెంజ్, సినామన్, పెప్పర్మింట్, స్పియర్మింట్, యుకలిప్టస్, ల్యావెండర్ వంటి ఏడు ఫ్లేవర్లలో ఆక్సిజన్ విక్రయిస్తున్నారు.
ఈ బార్లో బీర్ ఉండదు.. ఆక్సిజన్ మాత్రమే లభ్యం! 'ఈ బార్ పిల్లలకు, పెద్దలకు మంచి ఉపశమనాన్ని ఇస్తోంది. సువాసనలు వెదజల్లే ఆక్సిజన్ నిజంగా ఆహ్లాదకరంగా ఉంది' అని అన్నారు ఓ కస్టమర్.
'బయట కాలుష్యం విపరీతంగా ఉన్నందున ఇక్కడ స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను పీల్చేందుకు ఇక్కడికి వస్తున్నాం.'
-అంజనా, వినియోగదారు
ఈ బార్లో బీర్ ఉండదు.. ఆక్సిజన్ మాత్రమే లభ్యం!
"దిల్లీలో ఇలాంటి బార్ తొలిసారిగా తెరిచాం. ప్రస్తుతం కాలుష్యం చాలా ఎక్కువగా ఉంది. మా ఆక్సిజన్ ఉత్పత్తి ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది. రోజూ కనీసం 10 నుంచి 15 కస్టమర్లు వస్తున్నారు. మేము వారికి పోర్టబుల్ ఆక్సిజన్ క్యాన్స్ అందిస్తున్నాం. వాటికి వారు ఎక్కడికైనా తీసుకువెళ్లొచ్చు."
-అజయ్ జాన్సన్, బార్ నిర్వాహకుడు
ఇదీ చదవండి:ఆలోచన సూపర్ : బడిలో ప్రత్యేక 'నీటిగంట'