తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను ట్రాలీ రిక్షాపై కూర్చోబెట్టుకుని, సుమారు 80 కి.మీ దూరంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారాయన. ఈ ఘటన ఒడిశాలోని పూరి జిల్లాలో చోటు చేసుకుంది. సాక్షిగోపాల్ ప్రాంతానికి చెందిన కబీర్బోయి రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. 60 ఏళ్ల వయసులోనూ కష్టపడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
ఇటీవల ఆయన భార్య సుకాంతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెను పరీక్షించిన స్థానిక ఆసుపత్రి వైద్యులు కటక్ తీసుకెళ్లాలని సూచించారు. ఆసుపత్రిలో అంబులెన్స్ సదుపాయం లేదు. ప్రైవేటు అంబులెన్స్ వారిని సంప్రదిస్తే రూ.5వేలు ఆడిగారు. అందుకు స్తోమత లేక భార్యను తన రిక్షాపై తీసుకెళ్లాలని కబీర్బోయి అనుకున్నారు. శుక్రవారం ఉదయం గ్రామంలో బయలుదేరి శనివారానికి కటక్ చేరుకున్నారు.