మనకు జ్వరం, తలనొప్పి, ఇతరత్రా సమస్యలు వస్తే ఆసుపత్రికి వెళ్తుంటాము. మన బంధువులకు అకస్మాత్తుగా ప్రమాదం జరిగినా అంబులెన్స్ ద్వారా వారిని ఆసుపత్రికి తరలిస్తాము. ఇది సర్వసాధారణం. కానీ ఓ కోతి తనకు గాయం అయిందంటూ చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన ఘటన కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలో జరిగింది.
శనివారం డాండేలీలోని ఓ నర్సింగ్ హోం గడప వద్దకు ఓ కోతి వచ్చి కూర్చుంది. మొదట వానరాన్ని చూసిన సిబ్బంది భయపడి దాన్ని తరిమేందుకు ప్రయత్నించారు. కానీ అది ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ఆ గడప వద్దే దీనంగా కూర్చుంది. కొంత సమయం తర్వాత కోతికి గాయమైందని గమనించిన సిబ్బంది దానికి చికిత్స చేశారు.