తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రియురాలిని కలిసేందుకు పాక్​కు పయనం.. కానీ! - మహారాష్ట్ర పోలీస్​

ప్రేమ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు నేటి తరం ప్రేమికులు. ఎంతటి సాహసానికైనా సిద్ధమవుతున్నారు. మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు తన ప్రేయసి కోసం ఏకంగా పాకిస్థాన్​​ వెళ్లేందుకు ప్రయత్నించాడు. సరిహద్దులు దాటుతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆ యువకుడు ప్రేయసిని చేరుకున్నాడా? ప్రస్తుతం ఎక్కడున్నాడు? తెలుసుకుందాం.

An Indian going to Pakistan to meet his girl friend
ప్రియురాలిని కలిసేందుకు పాకిస్థాన్​కు.. ఆ తర్వాత?

By

Published : Jul 18, 2020, 7:30 AM IST

ప్రియురాలిని కలిసేందుకు పాకిస్థాన్​ సరిహద్దులోకి వెళ్లిన ఓ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు గుజరాత్​ పోలీసులు. అతడిని మహారాష్ట్రలోని ఉస్మానాబాద్​ టౌన్​కు చెందిన ఇంజినీరింగ్​ విద్యార్థి జిషాన్​ మహమ్మద్​ సిద్ధిఖిగా గుర్తించారు. గురువారం రాత్రి ద్విచక్ర వాహనంపై వచ్చిన జిషాన్​.. రాన్​ ఆఫ్​ కచ్​ వద్ద సరిహద్దు దాటి వెళ్తుండగా బీఎస్​ఎఫ్​ జవాన్​లు అడ్డుకుని పోలీసులకు అప్పగించినట్లు ఎస్పీ పరక్షిత రాఠోడ్​ తెలిపారు.

ఇదీ జరిగింది..

సామాజిక మాధ్యమం ద్వారా పాకిస్థాన్​లోని ఓ యువతితో జిషాన్​కు పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. ఫలితంగా ఆమెను కలిసేందుకు అతడు సరిహద్దు దాటేందుకు ప్రయత్నించాడు. పాక్​ సరిహద్దులోకి వెళ్లగానే అతడి బైక్​ ఇసుకలో ఇరుక్కుపోవడం గమనించిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ నెల 11న ఆ యువకుడు బైక్​పై ఇంటినుంచి బయల్దేరి వెళ్లినట్లు మహారాష్ట్ర పోలీసులు స్పష్టం చేశారు. సిద్ధిఖి కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు ఉస్మానాబాద్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా.. సంబంధిత వివరాల ఆధారంగా గుజరాత్​ నుంచి ఆ యువకుడిని తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఇదీ జరిగింది:రాహుల్​ విమర్శలకు జైశంకర్ ఘాటు జవాబు

ABOUT THE AUTHOR

...view details