తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పంజాబ్​లో కూలిన మిగ్​-29 యుద్ధ విమానం-పైలట్​ సేఫ్​ - mishap

An Indian Air Force fighter aircraft has crashed in Punjab
మరో ఘోరం- పంజాబ్​లో కూలిన యుద్ధ విమానం

By

Published : May 8, 2020, 11:55 AM IST

Updated : May 8, 2020, 12:58 PM IST

12:42 May 08

పంజాబ్​లో విమానప్రమాదం

భారత వైమానిక దళానికి చెందిన మిగ్​-29 యుద్ధ విమానం పంజాబ్​లోని నవాంశహర్​ జిల్లా ఛౌహర్​పుర్​ పరిధిలో కుప్పకూలింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడమే ప్రమాదానికి కారణమని అధికారులు వెల్లడించారు. అయితే పైలట్​ సురక్షితంగా బయటపడ్డాడు.  

విమానం కూలిన వెంటనే ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు సహాయకచర్యలు చేపట్టారు.  

శిక్షణా కార్యక్రమంలో భాగంగా జలంధర్​ సమీపంలోని వైమానిక స్థావరం నుంచి బయల్దేరిన కాసేపటికే విమానం కూలినట్లు వాయుసేన అధికారులు వెల్లడించారు. సాంకేతిక అవరోధంతో  విమానం అదుపుతప్పిందని వారు తెలిపారు. హెలికాఫ్టర్​ సాయంతోనే పైలట్​ను రక్షించినట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించినట్లు స్పష్టం చేశారు అధికారులు.  ​ 

12:15 May 08

పంజాబ్​లో ఘోర ప్రమాదం జరిగింది. భారత వాయుసేనకు చెందిన మిగ్​-29 యుద్ధ విమానం హోషియార్​పుర్​ జిల్లా పరిధిలో కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్​ సురక్షితంగా బయటపడ్డాడు. సమాాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు సహాయకచర్యలకు ఉపక్రమించారు.  

11:53 May 08

మరో ఘోరం- పంజాబ్​లో కూలిన యుద్ధ విమానం

వాయుసేనకు చెందిన యుద్ధ విమానం పంజాబ్​లో కూలింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Last Updated : May 8, 2020, 12:58 PM IST

ABOUT THE AUTHOR

...view details