దిల్లీ జామియా వర్సిటీలో మళ్లీ కాల్పుల కలకలం - Firing at Jamia Millia Islamia University
01:06 February 03
దిల్లీ జామియా వర్సిటీలో మళ్లీ కాల్పుల కలకలం
దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం (జేఎంఐయూ)లో ఆదివారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వర్సిటీ గేట్ నం.5 వద్ద కాల్పులు జరిపినట్లు జామియా సహకార కమిటీ (జేసీసీ) తెలిపింది.
వర్సిటీ పూర్వ విద్యార్థి సంఘం, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం దుండగులు ఎర్రటి స్కూటీపై వచ్చి కాల్పులు జరిపినట్లు సమాచారం. అయితే ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు. దుండగుల్లో ఒకడు ఎర్రటి జాకెట్ ధరించినట్లు జేసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.