మార్చి 8న మహిళా దినోత్సవం నిర్వహణకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతుంటే అంతకుముందే అతివల విషయంలో భారతీయ రైల్వే మరో ముందడుగు వేసింది. మహిళా సాధికారతకు ప్రోత్సాహమిచ్చే చర్యల్లో భాగంగా తొలిసారి ఎక్స్‌ప్రెస్ రైలు లోకో పైలెట్‌గా మహిళను నియమించింది.
తొలిసారి ఎక్స్‌ప్రెస్ రైలును నడిపి మహిళ ఘనత - a lady loco pilot .
మహిళా దినోత్సవానికి ముందే భారతీయ రైల్వే ముందడుగు వేసింది. తొలిసారిగా ఎక్స్‌ప్రెస్ రైలు లోకో పైలెట్‌గా మహిళను నియమించింది. బెంగళూరు- మైసూరు రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్‌ను శివపార్వతి నడిపినట్లు అధికారులు వెల్లడించారు.
![తొలిసారి ఎక్స్‌ప్రెస్ రైలును నడిపి మహిళ ఘనత An Express rail is driven by a lady loco pilot for the first time](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6275913-970-6275913-1583214919142.jpg)
తొలిసారి బెంగళూరు- మైసూర్ ఎక్స్‌ప్రెస్ నడిపిన మహిళ
తొలిసారి ఎక్స్‌ప్రెస్ రైలును నడిపిన మహిళ
బెంగళూరు-మైసూరు రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ రైలును బాలా శివపార్వతి అనే లోకోపైలెట్ నడపగా, రంగోలి పటేల్ అనే మరో మహిళ సహాయ లోకో పైలెట్‌గా విధులు నిర్వహించారు. మహిళా దినోత్సవం రోజున కూడా రాజ్యరాణి రైలును వీరిరువురూ నడుపుతారని రైల్వే అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి:శాంతి ఒప్పందంలో ఘనీ చర్యలు బేష్: ట్రంప్
Last Updated : Mar 3, 2020, 12:22 PM IST