తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్ర: పేలుడు ఘటనలో 10 మందికి మృతులు - పేలుడు

మహారాష్ట్ర: రసాయన పరిశ్రమలో పేలుడు- 8 మంది మృతి

By

Published : Aug 31, 2019, 11:18 AM IST

Updated : Sep 28, 2019, 11:04 PM IST

12:07 August 31

రసాయన పరిశ్రమలో పేలుడు...

మహారాష్ట్ర ధూలే జిల్లాలోని ఓ రసాయన పరిశ్రమలో ప్రమాదం చోటుచేసుకుంది. శిర్పుర్ తాలూకాలోని వాఘాడి గ్రామంలో ఉన్న పరిశ్రమలో..... ఈ ఉదయం సిలిండర్లు పేలడం వల్ల మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది వరకు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో అక్కడ మొత్తం 100 మంది కార్మికులున్నట్లు సమాచారం. పోలీసు బృందాలు, విపత్తు నిర్వహణ సిబ్బంది, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు

11:32 August 31

18 మంది పరిస్థితి విషమం...

పేలుడు ఘటనలో 8 మంది మృతి చెందగా... 32 మందికి గాయాలయ్యాయి. అందులో 18 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

11:26 August 31

ప్రమాద సమయంలో 100 మంది వరకు...

మహారాష్ట్ర ధూలే జిల్లాలోని ఓ రసాయన పరిశ్రమలో ప్రమాదం చోటుచేసుకుంది. శిర్పుర్ తాలూకాలోని వాఘాడి గ్రామంలో ఉన్న పరిశ్రమలో..... ఈ ఉదయం సిలిండర్లు పేలడం వల్ల మంటలు చెలరేగాయి. ఘటన జరిగిన సమయంలో అక్కడ మొత్తం 100 మంది కార్మికులుండగా..... పేలుడు ధాటికి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 21 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో....పోలీసు బృందాలు, విపత్తు నిర్వహణ సిబ్బంది, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు

11:08 August 31

రసాయన పరిశ్రమలో భారీ పేలుడు

  • మహారాష్ట్ర: ధూలెలోని రసాయనిక పరిశ్రమలో పేలుడు
  • పేలుడు ధాటికి 8 మంది మృతి, 21 మందికి గాయాలు
  • పరిశ్రమలో పేలిన సిలిండర్లు
  • ప్రమాదం జరిగిన సమయంలో 100 మంది కార్మికులు
  • ఘటనాస్థలిలో కొనసాగుతున్న సహాయకచర్యలు
Last Updated : Sep 28, 2019, 11:04 PM IST

ABOUT THE AUTHOR

...view details