తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా ఎఫెక్ట్​: 'ఈస్టర్​ సండే' రోజు కళతప్పిన చర్చిలు

క్రైస్తవులకు ప్రత్యేకమైనది ఈస్టర్. ఈ వేడుకలను ప్రతి ఏడాది ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే మహమ్మారి కరోనా కారణంగా ప్రజలందరు ఇళ్లకే పరిమితమైపోయారు. ఫలితంగా ప్రార్థనలతో కిటకిటలాడాల్సిన చర్చిలు బోసిపోయాయి. టీవీ ఛానెల్స్​, యూట్యూబ్​, ఫేస్​బుక్​లైవ్​ల ద్వారా ప్రార్థనలు వీక్షిస్తున్నారు ప్రజలు.

By

Published : Apr 12, 2020, 1:21 PM IST

An Easter of Facebook live prayers sans church visits during lockdown
కరోనా ఎఫెక్ట్​: 'ఈస్టర్​ సండే' రోజు కళతప్పిన చర్చిలు

ప్రతి ఏడాది ఈస్టర్​ పండుగ రోజు చర్చిలన్నీ కళకళలాడుతుండేవి. అయితే కరోనా కారణంగా ఈస్టర్​ వేళ దేశంలోని చర్చిలన్నీ బోసిపోయాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమై కుటంబసభ్యులతో కలిసి ప్రార్థనలు చేసుకుంటున్నారు.

ప్రముఖ చర్చిల్లో మతగురువులు టీవీ ఛానెల్స్​, యూట్యూబ్​, ఫేస్​బుక్​ లైవ్​ల​ ద్వారా ప్రార్థనలను ప్రసారం చేస్తున్నారు. పరిమిత సంఖ్యలో మాత్రమే చర్చికి వెళ్లి ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.

తమిళనాడు..

తమిళనాడు కోయంబత్తూరు ఆల్ సోల్స్ చర్చిలో రెవ్​ చార్లెస్​ ప్రార్థనలకు నాయకత్వం వహించారు. అయితే ఈసారి ఈస్టర్ వేడుకలు చర్చిలో భక్తులెవరు లేకుండానే జరిగాయి.

కరోనా ఎఫెక్ట్​: 'ఈస్టర్​ సండే' రోజు కళతప్పిన చర్చిలు

దిల్లీ

దిల్లీలోని గోల్​డాక్​ ఖానా దగ్గరలో ఉండే సేక్రేడ్​ హార్ట్​ కేథడ్రల్​ చర్చిలోనూ ఇదే పరిస్థతి కనిపించింది. ప్రతి ఏడాది ఈ రోజున సందడి సందడిగా ఉండే ఈ చర్చిని లాక్​డౌన్​ కారణంగా పూర్తిగా మూసివేశారు.

కరోనా ఎఫెక్ట్​: 'ఈస్టర్​ సండే' రోజు కళతప్పిన చర్చిలు

కేరళ, లఖ్​నవూ, ముంబయి, గోవా సహా ఇతర రాష్ట్రాల్లోని చర్చిల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

కరోనా ఎఫెక్ట్​: 'ఈస్టర్​ సండే' రోజు కళతప్పిన చర్చిలు
కరోనా ఎఫెక్ట్​: 'ఈస్టర్​ సండే' రోజు కళతప్పిన చర్చిలు

ఇదీ చూడండి:కుమారుడి అంత్యక్రియలకు 2,000 కి.మీ ప్రయాణం!

ABOUT THE AUTHOR

...view details