ఉత్తర భారతంలో వరుసగా భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. తాజాగా గుజరాత్ రాజ్‌కోట్‌లో 4.4 తీవ్రతతో మధ్యాహ్నం 12.57 గంటలకు భూకంపం సంభవించిందని జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (ఎన్సీఎస్) ప్రకటించింది.
రాజ్‌కోట్‌కు వాయువ్య దిశలో 83 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు ఎన్సీఎస్ తెలిపింది.
24 గంటల్లోనే..
గడిచిన 24 గంటల్లో గుజరాత్లో సంభవించిన రెండో భూకంపం ఇది. శనివారం రాత్రి 8.13 గంటలకు 5.5 తీవ్రతతో భూమి కంపించటం వల్ల కచ్, రాజ్‌కోట్, అహ్మదాబాద్, పటాన్ నగరాల్లోని ప్రజలంతా భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ భూకంప కేంద్రం కచ్ జిల్లా భచావులో నమోదైనట్లు అధికారులు తెలిపారు.
దిల్లీలోనూ..
వారం రోజుల కిందట దేశ రాజధానిలోనూ భూమి కంపించింది. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దిల్లీలో 14 సార్లు తక్కువ స్థాయి తీవ్రతతో భూకంపాలు సంభవించాయి.
ఇదీ చూడండి:గుజరాత్లో భూకంపం- రిక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రత