తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రపంచం చల్లగుండాలని.. సినీ కళాకారుడి సైకిల్​ యాత్ర - nagraj gowda cycle journey

సినిమా తారలు సాధారణంగా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. అయితే ఇతడిలా మాత్రం ఎవ్వరూ చేసి ఉండరు. ఎందుకంటే ప్రపంచ శాంతి కోసం 20 వేల కిలోమీటర్ల మేర సైకిల్​ యాత్ర చేపట్టాడు కన్నడ సినీపరిశ్రమకు చెందిన ఓ నటుడు. అవును మరి.. గుళ్లూ గోపురాల్లో భోజనం చేస్తూ అక్కడే పడుకుని రెండేళ్లుగా యాత్ర కొనసాగించడం అంత సులభమేమీ కాదు.

ప్రపంచం చల్లగుండాలని.. సినీ కళాకారుడి సైకిల్​ యాత్ర

By

Published : Nov 23, 2019, 11:02 PM IST

ప్రపంచం చల్లగుండాలని.. సినీ కళాకారుడి సైకిల్​ యాత్ర
ప్రపంచ శాంతి కోసం 20 వేల కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేస్తూ దేశమంతా చుట్టొచ్చాడు ఓ సినీ కళాకారుడు. కర్ణాటక హసన్​కు చెందిన కన్నడ నటుడు నాగ్​రాజ్​ గౌడ 2017 డిసెంబర్​ 3వ తేదీ నుంచి జాతీయ ఐక్యత, ప్రపంచ శాంతి, టెర్రరిజం, పర్యావరణం వంటి సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించే పని పెట్టుకున్నాడు. అందుకు యాత్రనే మార్గంగా ఎన్నుకున్నాడు. అంతే కాదు, నీటి పొదుపు, గోసంరక్షణ, పచ్చదనాన్ని కాపాడుకోవాలనీ ప్రచారం చేశాడు నాగ్​రాజ్​.

48 ఏళ్ల వయసులో ఏదోలా సమాజ సేవ చేయాలని యాత్ర ప్రారంభించాడు నాగ్​రాజ్​. దాతలిచ్చిన విరాళాలతో మార్చిలో ఈ యాత్ర మొదటి దఫాను పూర్తి చేసి మూడు నెలల విశ్రాంతి తరువాత రెండో దశ యాత్ర ప్రారంభిస్తాను అంటున్నాడు నాగ్​రాజ్​.

భోజనం, నిద్ర అక్కడే..

సైకిల్​పై కొన్ని జతల దుస్తులు, ఓ చాప, ఓ దుప్పటి పట్టుకెళ్లాడీ నటుడు. గుళ్లు, మసీదు, గురుద్వారాల్లో భోజనం చేసి అక్కడే నిద్రపోయి తిరిగి ఉదయాన్నే తన యాత్ర సాగిస్తాడు. వెళ్లిన ప్రతి చోటా తన పనికి మెచ్చి అందరూ ఎంతో కొంత సాయం చేశారని చెప్పుకొచ్చాడు నాగ్​రాజ్​.

ప్రముఖులను కలిసి..

ఈ యాత్రలో భాగంగా వెళ్లిన ప్రతి చోటా ప్రముఖులను కలిసి ప్రపంచ శాంతి గురించి బోధ చేస్తున్నాడు. అరవింద్​ కేజ్రీవాల్​, షీలా దీక్షిత్, సిద్ధరామయ్య, మల్లికార్జున్​ ఖర్గే, అఖిలేష్​ యాదవ్​, కమల్​నాథ్​, కల్యాణ్​ సింగ్​, మనోజ్​ తివారీ వంటి ప్రముఖ రాజకీయ నాయకులనూ కలిశాడు నాగ్​రాజ్​.

ఇదీ చదవండి:రాళ్లు రువ్వుకుంటూ యువకుల సంబరాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details