పాక్ సైన్యం కాల్పులు.. భారత జవాన్ మృతి - పాక్ కాల్పులు
పాక్ సైన్యం కాల్పులు.. భారత జవాన్ మృతి
09:28 August 01
పాక్ సైన్యం కాల్పులు.. భారత జవాన్ మృతి
సరిహద్దు వెంట పాకిస్థాన్ దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉంది. జమ్ముకశ్మీర్‌లోని పుంఛ్ జిల్లా బాలాకోట్ సెక్టార్ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్ సైన్యం. ఈ ఘటనలో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బుధవారం.. నియంత్రణ రేఖ వెంబడి బారాముల్లా వద్ద మోర్టార్లు, ఆయుధాలతో దాడి చేసింది దాయాది సైన్యం. ఈ ఘటనలోనూ ఓ సైనికుడు మృతి చెందాడు.
Last Updated : Aug 1, 2020, 10:10 AM IST