1947లో రాజకీయ స్వాతంత్య్రం పొందిన భారతావని లైసెన్స్ పర్మిట్ రాజ్ శృంఖలాల్లో చిక్కి దాదాపు నాలుగున్నర దశాబ్దాలు ఛిద్రమైన దేశార్థిక వ్యవస్థకు.. ఆ సంకెళ్లు తెంచి సంస్కరణల నవశకానికి నాందీ వాచకం పలికింది పీవీ! అయిదేళ్లలోనే పీవీ దిద్దిన సంస్కరణల ఒరవడి, కేంద్రంలో ఎవరు అధికారానికి వచ్చినా మూడు దశాబ్దాలుగా శిరోధార్యం అవుతూనే ఉంది. ఆయన పదవీ రాజకీయాల రణజన్ముడు కాదు.. సంస్కరణల పథంలో దేశాన్ని కదం తొక్కించిన కారణజన్ముడు!
పూర్తి కథనం:తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
తెలుగు జాతి అనర్ఘరత్నం పీవీ నరసింహారావు మొక్కవోని దీక్షాదక్షతకు పెట్టింది పేరు. ఆయన రాజకీయ దురంధరుడే కాదు గొప్ప పండితుడు కూడా. భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించి, ఆర్థిక పునరుజ్జీవనం దిశగా పరుగులు తీయించిన ధీశాలి. ఈ మహా మనీషికి భారతరత్న పురస్కారం అందించి సత్కరించుకోవాల్సిన తరుణమిదే.
పూర్తి కథనం:తెలుగు జాతి అనర్ఘరత్నం పీవీ నరసింహారావు
'ఒక వ్యక్తి పుట్టుకతో కాదు, చేతల వల్ల గొప్పవాడవుతాడు' అని కౌటిల్యుడు అన్న మాటలు పీవీ నరసింహారావుకు అతికినట్లు సరిపోతాయి. ఎందుకంటే ప్రధానిగా ఆయన చేసిన కృషి నిరుపమానం. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈనాడు భారత్‌ను ఆర్థికంగా నిలబడేలా చేశాయి.
పూర్తి కథనం:ఆర్థికం తెలియకున్నా.. అందులోనూ తనదైన ముద్ర
పీవీ నరహింహారావు.. బహుముఖ ప్రజ్ఞశాలిగా, రాజనీతిజ్ఞుడిగా సుపరిచితమే. కానీ, ఆయనలో చాలా మందికి తెలియని ఇంకో కోణం ఉంది. ఆధ్యాత్మిక మార్గంలోనూ ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఓ దశలో పీఠాధిపతి అయ్యేందుకు సిద్ధమయ్యారు కూడా. 1991లో జరిగిన అనూహ్య పరిణామాలతో ప్రధాని పీఠాన్ని అధిరోహించారు.
పూర్తి కథనం:పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠాన్ని అధిరోహించి
'వచ్చే ఎన్నికల గురించి ఆలోచన చేసేవాడు నాయకుడు. వస్తున్న తరాల భవిష్యత్తును నిర్దేశించే వ్యక్తిని రాజనీతిజ్ఞుడు' అని అంటారు. నరసింహారావు రెండో కోవకు చెందినవారు. నిజానికి ఆయన వ్యక్తి నుంచి ప్రభావిత శక్తిగా, వ్యవస్థగా ఎదిగిన దార్శనికుడు. ఆర్థిక సంస్కరణల పథ నిర్దేశకుడు, నవభారత నిర్మాత పీవీ.
పూర్తి కథనం:పీవీకి 'వంద'నం: సంస్కరణల సారథి.. అభివృద్ధికి వారధి
బహుముఖ ప్రజ్ఞాశాలి... ఎన్నో భాషల్లో నిష్ణాతుడు... రాజకీయ సోపానంలో ముఖ్యమంత్రిగా... కేంద్రమంత్రిగా... ప్రధానమంత్రిగా... ఏ పదవి చేపట్టినా... ఆయనది మునీశ్వర తత్వమే. కర్మయోగిలా తన పని చేసుకుంటూ వెళ్లడమే ఆయన నైజం. భారత రాజకీయ యవనికపై తనదైన ముద్రవేసి, ప్రగతి ఫలాల కోసం చెట్లు నాటి మనకు అందించిన దార్శనికుడు.
పూర్తి కథనం:పీవీ ప్రత్యేకం: తెలుగు కీర్తి.. పాములపర్తి
1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. నేడు పీవీ శతజయంతి సందర్భంగా ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని, అనుభవాలను 'ఈనాడు, ఈటీవీ భారత్' కోసం రాసిన ప్రత్యేక వ్యాసంలో పంచుకున్నారు సింగ్. 'స్వలాభం కోసం పాకులాడకుండా, ఫలాపేక్ష లేకుండా విధులు నిర్వహించిన నిజమైన కర్మసన్యాస యోగి' అని పేర్కొన్నారు.
పూర్తి కథనం:'పీవీ.. భరతమాతకు గర్వకారణమైన పుత్రరత్నం'