తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రకృతి ఒడిలో 'జీప్​ రేస్'​.. ఆ కిక్కే వేరప్పా!

కర్ణాటకలోని చిక్కమగళూరులో "ఆఫ్​-రోడ్​ జీప్​ రేస్​" నిర్వహించారు. కరోనా సంక్షోభం జరిగిన తొలి రేస్​ కావడం వల్ల దీనికి విశేష ఆదరణ లభించింది. అడవులు, బురద, చెరువులు, కొండల మధ్య దాదాపు 30కిలోమీటర్ల పొడవున నిర్మించిన రేస్​ ట్రాక్​కు రైడర్లు ఫిదా అయిపోయారు.

An Adventurous off-road jeep Race in Chikkamagaluru
ప్రకృతి ఒడిలో 'జీప్​ రేస్'​.. ఆ కిక్కే వేరప్ప!

By

Published : Sep 16, 2020, 3:22 PM IST

ఆఫ్​-రోడ్​ జీప్​ రేస్​

ఎన్నో ప్రకృతి అందాలకు నిలయం కర్ణాటక. జలపాతాల నుంచి పచ్చటి అడవుల వరకు.. ప్రకృతి ప్రేమికుల మనసు దోచుకునే ఎన్నో విశేషాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మరి ప్రకృతి అందాల మధ్య నిర్వహించే రేసులో రయ్​ రయ్​ మంటూ దూసుకుపోతే? 'ఆహా ఆ కిక్కే వేరప్పా...' అని అనుకుంటున్నారా? అయితే వెంటనే చిక్కమగళూరుకు వెళ్లి.. "ఆఫ్​-రోడ్​ జీప్​ రేస్​"లో పాల్గొనాల్సిందే.

ట్రాక్​ అదుర్స్​...

ఈ జీప్​ రేస్​ను మంగళవారం నిర్వహించారు. కరోనా సంక్షోభం అనంతరం జరిగిన తొలి రేస్​ కావడం వల్ల.. దీనికి విశేష ఆదరణ లభించింది. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన దాదాపు 50మందికిపైగా రైడర్లు ఈ రేసులో పాల్గొన్నారు.

ఈ రేసులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ట్రాక్​ గురించే. కాఫీ పొలాలు, అడవులు, కొండలు, బురద, చెరువుల మధ్యలో దాదాపు 30కిలోమీటర్ల పొడవున ఈ ట్రాక్​ నిర్మించారు. ఫలితంగా రైడర్లకు సాహసం చేసిన అనుభూతితో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశమూ లభించింది. తమ జీవితంలో ఇదొక అత్యద్భుతమైన రైడ్​ అని చెప్పారు వారు.

ప్రకృతి ఒడిలో
బురదలో రయ్​ రయ్​

ఇదీ చూడండి:-ఐదుగురు భర్తలుండగా.. 22 ఏళ్ల ప్రియుడితో ఆరో పెళ్లి!

ABOUT THE AUTHOR

...view details