12 మందితోసోమవారంగల్లంతైన... భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కు చెందిన ఏఎన్-32 ఎయిర్క్రాఫ్ట్ గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశారు అధికారులు.
ప్రతికూల వాతావరణం కారణంగా విమాన అన్వేషణకు ఆటంకాలు ఏర్పడుతున్నట్లు ఐఏఎఫ్ తెలిపింది. వెలుతురు లేమి కారణంగా రాత్రి పూట అత్యాధునిక లైట్లు, సెన్సార్లతో కూడిన సీ-130జే హర్క్యులెస్ ఎయిర్ క్రాఫ్ట్ విమానంతో మాత్రమే గాలింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అధికారులు.
విమానాలతో మాత్రమే కాకుండా.. పోలీసులు, స్థానిక ఏజెన్సీ అధికారులు కూడా గాలింపు చర్యల్లో పాల్గొంటున్నట్లు తెలిపింది. భారత నావికా దళానికి చెందిన పీ-81 విమానం శుక్రవారం ఉదయం తిరిగి గాలింపు ఆపరేషన్లో పాల్గొంటుందని వెల్లడించింది.
గురువారం మొత్తం 4 ఎంఐ-17 హెలికాఫ్టర్లు, మూడు అత్యాధునిక హెలికాప్టర్లు, రెండు సుఖోయ్-30 విమానాలు, ఒక సీ-30 విమానం సహా మరో మానవ రహిత విమానంతో గాలింపు చేపట్టినా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని ఐఏఎఫ్ పేర్కొంది.
ప్రమాదం ఎప్పుడు,ఎక్కడ ?
రష్యాలో తయారైన ఏఎన్-32 విమానం అసోంలోని జోర్హట్ విమానశ్రయం నుంచి మధ్యాహ్నం 12:27 గంటల ప్రాంతంలో గాల్లోకి ఎగిరింది. బయలుదేరిన అరగంట తర్వాత విమానానికి ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి.
భర్త కాక్ పిట్లో.. భార్య ఏటీసీలో