తెలంగాణ

telangana

ETV Bharat / bharat

13 మంది సహా భారత యుద్ధ విమానం గల్లంతు - ఏఎన్​- 32 విమానం

భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్​-32 విమానం గల్లంతైంది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో అరుణాచల్​ప్రదేశ్​లోని మెన్చూకా గగనతలం వద్ద సంబంధాలు తెగిపోయాయి. విమానంలో 13 మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.​

13 మందితో భారత యుద్ధ విమానం గల్లంతు

By

Published : Jun 3, 2019, 4:33 PM IST

Updated : Jun 3, 2019, 11:09 PM IST

భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్​- 32 విమానం అదృశ్యమైంది. మధ్యాహ్నం 12:25 గంటలకు అసోంలోని జోహ్రాత్​​ ఎయిర్​బేస్​ నుంచి బయలు దేరింది విమానం. చివరిగా ఒంటి గంట సమయంలో అరుణాచల్​ప్రదేశ్​లోని మెన్చూకా గగనతలం వద్ద సంబంధాలు తెగిపోయాయి.

విమానంలో మొత్తం 8 మంది సిబ్బంది సహా ఐదుగురు ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.

ఏఎన్​-32 విమానం ఆచూకీ కనుగొనేందుకు అధికారులు భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. సుఖోయ్​- 30, సీ- 130 యుద్ధ విమానాలు రంగంలోకి దిగాయి.

పరిస్థితిని రక్షణమంత్రి రాజ్​నాథ్​ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

Last Updated : Jun 3, 2019, 11:09 PM IST

ABOUT THE AUTHOR

...view details