అంపన్ తుపాను సోమవారం సాయంత్రానికి సూపర్ సైక్లోన్‌గా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) హెచ్చరించింది. మే 20 మధ్యాహ్నం లేదా సాయంత్రానికి బంగాల్లోని దిఘా, బంగ్లాదేశ్‌లోని హతియా ద్వీపాల మధ్య 185 కి.మీ వేగంతో తీరం దాటే అవకాశముందని అంచనా వేసింది.
ఒడిశా పారదీప్‌కు దక్షిణాన 790 కి.మీ, బంగాల్లోని దిఘాకు నైరుతి దిశగా 940 కి.మీ, బంగ్లాదేశ్ ఖేపుపారాకు 1060 కి.మీ దూరంలో అంపన్ కేంద్రీకృతమై ఉందని ఐఎమ్‌డీ పేర్కొంది. ప్రస్తుతం ఇది బంగాల్ తీరం వెంబడి దక్షిణ-నైరుతి దిశగా 13 కి.మీ వేగంతో పయనిస్తోందని తెలిపింది.
భారీ నష్టం!
తుపాన్ ధాటికి బంగాల్, ఒడిశా తీరం వెంబడి తీవ్రమైన గాలులతో, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 11 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఒడిశా ప్రభుత్వం సిద్ధం కావాలని సూచించింది.