తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో కరోనా పరిస్థితిపై నేడు అఖిలపక్ష భేటీ - today alla party meeting

కేంద్ర హోంమంత్రి అమిత్​షా నేతృత్వంలో దిల్లీలో కరోనా పరిస్థితిపై సోమవారం దేశరాజధాని ప్రాంతానికి చెందిన అఖిలపక్ష నేతలు భేటీ కానున్నారు. వైరస్ నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, నగర మేయర్లతో సమావేశమైన అమిత్​షా.. దిల్లీలో మహమ్మారి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఆయా పక్షాల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.

amith shah
దిల్లీ పరిస్థితిపై సోమవారం అఖిలపక్ష భేటీ

By

Published : Jun 15, 2020, 5:16 AM IST

Updated : Jun 15, 2020, 7:07 AM IST

దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్ కట్టడిపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. భాజపా,కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ పార్టీలకు ఈ మేరకు ఆహ్వానం అందింది. ఈ భేటీలో దిల్లీలోని ప్రస్తుత పరిస్థితులు, కరోనా వైరస్ విస్తరిస్తున్న తీరుపై చర్చించనున్నారు. వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీల అభిప్రాయాలను అడిగి తెలుసుకోనున్నారు.

దిల్లీలో వైరస్ కట్టడిపై చర్చించేందుకు దిల్లీ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ బైజల్,సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇతర ఉన్నతాధికారులతో ఆదివారం సమీక్ష జరిపిన అమిత్ షా టెస్ట్‌ల సంఖ్యను రెట్టింపుచేస్తామని వెల్లడించారు.

కరోనా పరీక్షలు, చికిత్సల రేట్లను ఖరారు చేసేందుకు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పడకల లభ్యతను పరిశీలించేందుకు ఏర్పాటుచేసిన వీకే పాల్ నేతృత్వంలోని కమిటీ కేంద్ర హోంమంత్రికి ఇవాళ నివేదిక సమర్పించనుంది.

వైరస్​పై సమైక్య పోరాటం..

ప్రస్తుత వైరస్ సంక్షోభ పరిస్థతుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మునిసిపల్ కార్పొరేషన్లు కలిసి సమర్థంగా పోరాడనున్నట్లు చెప్పారు తూర్పు దిల్లీ నగర మేయర్ అంజు కమల్​కాంత్ తెలిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆదివారం కేంద్ర హోంమంత్రితో సమావేశమైన అనంతరం చెప్పారు.

ఇదీ చూడండి:కరోనా పంజా: నవంబరులో అత్యంత దారుణ స్థితి!

Last Updated : Jun 15, 2020, 7:07 AM IST

ABOUT THE AUTHOR

...view details