తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పరీక్షలు పెంచాం.. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయ్​'

దిల్లీలో కరోనా కట్టడికి స్థానిక ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. దిల్లీ ప్రభుత్వానికి సాయం చేయాలని ప్రధాని కోరిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నట్లు వెల్లడించారు.

AMITH SHA ABOUT DELHI COVID SITUATION
కేంద్రం-దిల్లీ ప్రభుత్వాల సమన్వయంతో కరోనా కట్టడి: షా

By

Published : Jun 28, 2020, 2:28 PM IST

దేశ రాజధాని దిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళుతున్నట్లు తెలిపారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. తాము తీసుకునే ప్రతి నిర్ణయంలో ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ భాగస్వాములవుతున్నారని తెలిపారు. కేంద్రంపై కొన్ని రాజకీయ ప్రకటనలు చేసినప్పటికీ.. కరోనా పోరులో తీసుకునే నిర్ణయాలపై అవి ఎలాంటి ప్రభావం చూపవన్నారు.

" దిల్లీలో జులై చివరి నాటికి 5.5 లక్షలకుపైగా కేసులు నమోదవుతాయని ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోడియా ప్రకటన చేసినా.. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హోంశాఖ సహాయం అందించాలని ప్రధాని మోదీ కోరారు. ప్రధాని సూచన మేరకు సమన్వయ సమావేశం నిర్వహించి.. కంటైన్​మెంట్​ జోన్లలో ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించటం సహా.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం. దిల్లీలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. ప్రజలు ఆందోళనకు గురికావద్దు. పరీక్షల సామర్థ్యాన్ని 4 నుంచి 5 రెట్లు పెంచాం."

- అమిత్​ షా, కేంద్రం హోంమంత్రి

భయానక పరిస్థితి నుంచి..

దిల్లీలో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన బాధితుల మృతదేహాల పరిస్థితి భయంకరంగా ఉండేదన్నారు షా. 350కిపైగా మృతదేహాలు అంత్యక్రియల కోసం పెండింగ్​లో ఉంటే.. రెండు రోజుల్లో వారి మతాచారాల ప్రకారం అంత్యక్రియలు పూర్తిచేయాలని ఆదేశించినట్లు తెలిపారు. దీంతో ప్రస్తుతం ఒక్క మృతదేహం కూడా నిర్లక్ష్యానికి గురయ్యే అవకాశం లేదని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details