తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నీతి ఆయోగ్​ చీఫ్​గా అమితాబ్​ కొనసాగింపు - సీఈఓ

నీతి ఆయోగ్​ సీఈఓగా అమితాబ్​ కాంత్​ మరో రెండేళ్లు కొనసాగనున్నారు. ఈ మేరకు కేబినెట్​ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.

అమితాబ్‌ కాంత్‌

By

Published : Jun 27, 2019, 7:01 AM IST

Updated : Jun 27, 2019, 7:37 AM IST

నీతి ఆయోగ్​ చీఫ్​గా అమితాబ్

నీతి ఆయోగ్‌ సీఈఓగా అమితాబ్‌ కాంత్‌ మరో రెండేళ్లు కొనసాగనున్నారు. ఈ మేరకు ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేబినెట్‌ నియామకాల కమిటీ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జూన్‌ 30 వరకు ఆయన సీఈఓగా కొనసాగుతారు.

1980 బ్యాచ్​ ఐఏఎస్‌ అధికారి అమితాబ్​ కాంత్​.. 2016 ఫిబ్రవరి 17న నీతి ఆయోగ్‌ సీఈవోగా నియమితులయ్యారు. నీతి ఆయోగ్​ సీఈఓ పదవీకాలం రెండేళ్ల పాటు ఉంటుంది. 2018లో ఆయన పదవీకాలం పూర్తయినప్పుడు 2019 జూన్​ 30 వరకు పొడిగిస్తూ అప్పటి కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మరో రెండేళ్లు పొడిగించింది.

నీతి ఆయోగ్‌ బాధ్యతలు చేపట్టకముందు పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగానికి కార్యదర్శిగా పనిచేశారు అమితాబ్​. ప్రస్తుతం ఈ విభాగాన్ని 'డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌'గా పిలుస్తున్నారు.

ఇదీ చూడండి: బాలాకోట్​ దాడుల వ్యూహాకర్తకు 'రా' బాధ్యతలు

Last Updated : Jun 27, 2019, 7:37 AM IST

ABOUT THE AUTHOR

...view details